హైదరాబాద్ యువత నిర్వాకం

0
109

హైదరాబాద్ ఇక్కడ ఎవ్వరు ఎలాగైనా బతక వచ్చు అడిగే వాడే ఉండడు. అందుకే యువత రెచ్చిపోతున్నారు. పోలీసుల వద్దకు రక రకాల కంప్లైంట్స్ వస్తున్నాయి. సర్ ఇంతవరకు నేను ఏ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు స్థానిక పోలీసులు స్పందించడం లేదు. కొంత మంది చేసే న్యూసెన్స్ అరికట్టమని పోలీస్ ఫోర్స్ గా వచ్చా దయ చేసి యాక్షన్ తీసుకోండి సర్.  మా ఇంటి పరిసరాలలో పుట్ట గొడుల్లా హాస్టల్ వెలిసాయి.

వాటిలో ఎన్నింటికి పెర్మిషన్స్ ఉన్నాయో తెలియదు వాళ్ళు చేసే న్యూ సెన్స్ అంతా ఇంతా కాదు వాళ్ళు చేసే పనుల వల్ల రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదు దయచేసి యాక్షన్ తీసుకోండి సర్. అంటూ ఇద్దరు యువతులు హిమాయత్నగర్ నుంచి పోలీస్ అధికారులు మరియు జిహెచ్ఎంసి కమిసనర్ కు వినతి పత్రం రాశారు. వాళ్ళు తిరిగి యాక్షన్ తీసుకోవాలంటూ అధికారుకలకు  చెప్పి  నెల రోజులు అయ్యింది కాని ఎవ్వరు పట్టించు పటించుకోవడం లేదు.

హిమాయత్ నగర్ లోని తెలుగు అకాడమీ దగ్గర 10 హాస్టల్స్ ఉన్నాయి. అందులో 8 గర్ల్స్ హాస్టల్స్ 2 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ గాలిలో రాత్రి 8 గంటల నుండి రాత్రి 11 వరకు అమ్మాయి అబ్బాయిలతో సందడిగా ఉంటుంది. రాత్రి 11 తరువాత అసలు రచ్చ మొదలవు తుంది. అమ్మాయిలు అబ్బాయిలు జంటలుగా  నిలబడడం అసభ్యకరంగా ప్రవర్తించడం పెద్దగా కేకలు వేయడం, అర్ధరాత్రి సెల్పీలు ,డ్యాన్సులు, అంత్యాక్షరీలు, బైక్ రైడ్ లు చేస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు చెపుతున్నారు.

మార్చి జరిగిన హోలీ రోజు కొంత మంది యువకులు మందు బాటిళ్లు చూపిస్తూ వీరంగం సృష్టించారు. ఎందుకు ఇలా చేస్తున్నారని స్థానికులు అడిగితే హాస్టల్ యజమానులు వాళ్ళు ఏదో హోలీ చేసుకుంటున్నారు మిమల్ని ఏమి అనడం లేదుగా అంటూ సమాధానం చెప్పారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులకు పిర్యాదు చేసిన స్పందించడం లేదు. ఈ హాస్టల్స్ నడుపుతున్న వాళ్ళ వెనక బడా బడా నాయకులూ ఉన్నారని  స్థానికులు చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here