త్వరలో పెళ్లి చేసుకోబోతున్న హైపర్ ఆది…షాక్ లో జబర్దస్త్ టీమ్!

0
85
జబర్దస్త్ షోకి సంబంధించి యూట్యూబ్ లో విడుదల చేసే ప్రతి స్కిట్ కి దాదాపుగా మిలియన్ కి పైగా వ్యూస్ వస్తుంటాయి అంటేనే అర్ధం చేసుకోవచ్చు, ఆ షో ఎంతటి సక్సెస్ సాధించింది అనే విషయం. ఇకపోతే ఈ షోలో వెరైటీ పంచ్ డైలాగ్స్ తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించిన నటుడు హైపర్ ఆది. మొదట ఈ షోలో ఒక స్కిట్ లో చిన్న క్యారెక్టర్ చేసిన ఆది, మెల్లగా తన టాలెంట్ తో స్వయంగా స్కిట్స్ రూపొందించే స్థాయికి ఎదిగాడు. నిజానికి చెప్పాలంటే, ఈ షోలో అందరికంటే ఎక్కువగా పేరు సంపాదించి, పారితోషికం పరంగా కూడా ఎక్కువ తీసుకునేది కూడా ఆదినేనట. అయితే ఆది గత కొన్నివారాలుగా షోకి రాకపోవడంతో, వాళ్ళ స్కిట్స్ ని కేవలం రైజింగ్ రాజు మాత్రమే తమ టీమ్ తో నడిపిస్తున్నాడు. ఇకపోతే ఆది షోకి రాకపోవడంపై కొన్నాళ్ళనుండి రకరకాల కథనాలు పలు మీడియా వేదికల్లో ప్రచారంలో వున్నాయి. అయితే ప్రస్తుతం కొన్ని మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం,
అతడు షోకి రాకపోవడానికి ఒక బలమైన కారణం ఉందని వినికిడి. అదేమిటంటే, ఆది త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నాడని, కొద్దిరోజుల్లో పెళ్ళిపెట్టుకుని ఇప్పుడు షోలు చేయవలసిన అవసరం లేదు, కొన్నాళ్ళు షో కు బ్రేక్ ఇవ్వు అని తన ఇంట్లో వాళ్ళు ఆదికి చెప్పారట. అందువల్లనే అయన కొన్నాళ్ల పాటు జబర్దస్త్ కు బ్రేక్ ఇచ్చాడట. అంతేకాక, తనకు వస్తున్న సినిమా ఆఫర్లు కూడా ఎప్పటికపుడు పూర్తి చేసుకుని వెంటనే తన స్వగ్రామానికి వెళ్తున్నాడని అంటున్నారు. అయితే ఆది చేసుకోబోయేది కూడా తన బంధువుల అమ్మాయినే అని సమాచారం. ఇక ఈ విషయం జబర్దస్త్ షో నిర్వాహకులతో పాటు పార్టిసిపెంట్స్, మరియు జడ్జీలు రోజా మరియు నాగబాబులకు కూడా తెలుసునని, కాకపోతే ఈ విషయాన్నీ బయటకు చెప్పవద్దని ఆది తల్లి తండ్రులు కోరడంవల్లనే, వారందరూ ఆది షోకి రాకపోవడం పై మీడియాకి కారణం చెప్పకుండా మౌనంగా వున్నారని చెప్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here