స్టార్ హీరోయిన్స్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

0
83
ఇటీవల కొద్దిరోజులుగా తన వ్యాక్యలతో తరచూ మీడియా వేదికల్లో విపరీతంగా సంచలనం రేపుతున్న ప్రముఖ మాత ప్రబోధకుడు మరియు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అయినా కేఏ పాల్ నేడు తనకు నటి సమంత, మరియు రకుల్ ప్రీత్ సింగ్ ఎవరో కూడా తెలియదని కొన్ని ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసారు.నేడు ఓ తెలుగు టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనపై పలు ప్రశ్నలు సంధించారు. అయితే నందమూరి బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అని ఇటీవల పాల్ చేసిన వ్యాఖ్యల గురించి ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించగా, అవును నాకు తెలియదు అని అయన అన్నారు.  పోనీ సమంత, రకుల్ ప్రీత్ సింగ్ మీకు తెలుసా అని అడిగిన ప్రశ్నకు, తనకు తెలియదని జవాబివ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. .,మరి పవన్ కల్యాణ్ ఎవరో తెలుసా అనే ప్రశ్నకు ..
Related image
ఇప్పటికే పవన్ ని రెండుసార్లు కలిశానని అన్నారు.  మరి దివంగత ఎన్టీఆర్ గారు తెలుసా అని అడగగా, తాను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటికే ఆయన హీరో అని, ఆయన తెలియకపోవడమేంటంటూ వ్యాఖ్యలు చేశారు.  అయితే, సమంత ఎవరో తనకు తెలియదన్న కేఏ పాల్, ఆ తర్వాత ఆమె నాగార్జున కోడలని చెప్పారు. ఎందుకంటే, తాను రాజకీయాల్లో ఉన్నాను కనుక, అందరి ఓట్లు తనకు కావాలని, అందుకే, తెలియని ప్రముఖుల గురించి తెలుసుకుంటున్నానంటూ చెప్పుకురావడం గమనార్హం. తెలియని వాళ్ల గురించి ‘తెలియదు’ అని చెప్పడమే కరెక్టు అని, అబద్ధం చెప్పడం తనకు చేతగాదని అన్నారు. ఇక పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here