ఆ ఊళ్ళో రైతుని పెళ్లాడిన అమ్మాయిలకు రూ. 1లక్ష నజరానా!

0
57
నిజానికి మనందరికీ అన్నం పెట్టె రైతన్న పరిస్థితి రానురాను మరింతగా దిగజారిపోతోంది. ఒకప్పటివలె నేటి యువత కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడడం లేదు. ఎక్కువగా అందరూ ఇతర వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ఇలా వ్యవసాయం చేసి తమ జీవనాన్ని కొనసాగిస్తున్న యువకులకు పెళ్లి సంబంధాలు కూడా రావడం లేదు. అయితే ఇటువంటి వాటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో, కర్నాటక రాష్ట్రంలో పెళ్లి కాక నానా ఇబ్బందులు పడుతున్న రైతు అబ్బాయిలకోసం యల్లాపుర ప్రాంతానికి చెందిన ఆనగోడ గ్రామ సేవా సహకారం సంఘం ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ వారు తీసుకున్న ఆ కీలక నిర్ణయం ఏమిటంటే, తమ గ్రామానికి చెందిన యువ రైతులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు లక్ష రూపాయలను నజరానాగా ఇవ్వాలని నిర్ణయించడం.
తమ గ్రామంలో వ్యవసాయం చేస్తున్న రైతు అబ్బాయిలకు పెళ్లిళ్లు కాకపోతుండటంతో గ్రామ ప్రజలు తీవ్రమైన ఆందోళనలో వుంటున్నారు. ఈ సమస్యను గమనించిన సంఘం, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే తమ సంఘం ద్వారా పెళ్లాడాలనుకునే యువకులు సభ్యులుగా చేరాలని ఒక చిన్న కండిషన్ పెట్టింది. అయితే అలా వివాహం చేసుకునే అమ్మాయిలకు కులం, మతం ప్రస్తావన అవసరంలేదని తేల్చి చెప్పింది. తమ గ్రామానికి చెందిన రైతు అబ్బాయిలను వేరే గ్రామాలకు చెందిన అమ్మాయిలు కూడా పెళ్లాడవచ్చంటూ ఆఫర్ ఇచ్చింది. మరి ఈ అవకాశాన్ని ఎంతమంది అమ్మాయిలు సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి. అయితే ఈ తరహా నిర్ణయం వలన వ్యవసాయం చేసే యువకులకు ఎంతో మేలు చేస్తుందని, ఈ తరహా విధానాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకువస్తే మంచిదని పలు రాష్ట్రాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here