ఆఫీసుల్లో అదేపనిగా కూర్చుని పనిచేస్తున్నారా?….అయితే మీరు తప్పనిసరిగా ఇది చూడండి!

0
78
నిజానికి ఒకప్పటితో పోలిస్తే నేటి మనిషి అదేపనిగా ఆఫీసుల్లో సిస్టం ముందు కూర్చుని పని చేయడం ఎక్కువయింది. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ వినియోగం అధికవ్వడం. ఇక ఒకప్పుడు కొన్ని రకాల పనులకు ఒళ్ళు కదిల్చి అటు, ఇటు తిరగవలసి రావడం వలన శరీరంలో కొంత కదలిక ఏర్పడి రక్తప్రసరణ బాగా జరిగేది. అయితే ఇప్పుడు అదేపనిగా దాదాపుగా కొన్నిగంటల పాటు కూర్చుని ఉండడం వలన షుగర్, బిపి, నరాలు మరియు గుండె సంబంధ వ్యాధుల వంటివి తేలిగ్గా సంక్రమిస్తున్నాయి. ఇక ఆ విధంగా కూర్చుని పనిచేసేవారు మధుమేహంతో పాటు గుండె జబ్బులు బారిన పడే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది తాజా అధ్యయనంలో వెల్లడైంది. దానివల్ల స్థూలకాయం ఏర్పడి, తద్వారా మధుమేహం బారిన పడేందుకు అవకాశం ఉందని ఈ అధ్యయనం చెబుతోంది.
Image result for continuous working in office
అయితే ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే అరగంటపాటు వ్యాయామం చేసేవారు ఇకపై తమ ఆరోగ్యానికి ఏ సమస్య ఉండదని అనుకుంటుంటారుగానీ, నిజానికి రోజంతా ఒళ్లు కదల్చకుండా కూర్చోవడం వలన కలిగే నష్టాన్ని ఈ అరగంట వ్యాయామాలు ఏమాత్రం భర్తీ చేయలేవని వారు చెబుతున్నారు. గంటలతరబడీ అదేపనిగా కూర్చొని పని చేసుకుంటుండేవారు ఎక్కువసేపు కూర్చోకుండా వీలైనప్పుడల్లా సీట్లోంచి లేచి, ఆటూ ఇటూ తిరగడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఆఫీసు కారిడార్లలో పచార్లు చేయడం, అలానే ఆఫీసు మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చేస్తే శరీరంలో రక్తప్రసరణను ఎంతో మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సో విన్నారుగా మీరు కూడా ఈవిధంగా గంటల తరబడి కూర్చుని పని చేస్తుంటే ఇటువంటి చిన్న పద్దతలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here