రాబోయే ఎండాకాలంలో ఏసి లేకపోయినా, ఇంటిని ఇలా ఏసీ గదిలా మార్చుకోవచ్చు!

0
122
మరికొద్దిరోజుల్లో సంక్రాంతి పై శివరాత్రి రాకతో పూర్తిగా చలికాలం వెళ్లిపోవడం జరిగి, ఎండాకాలం ప్రవేశిస్తుంది. ఇక అక్కడినుండి అందరూ ఒకటే ఉక్కపోతతో అల్లాడిపోతుంటారు. ఇక ముఖ్యంగా ఆ సమయంలో ఇంట్లో ఎసి వంటివాటిని కొనలేనివారు ఈ కొద్దిపాటి మార్పులు చేర్పులతో తమ ఇంటిని చల్లగా మార్చుకుని వేసవి తాపం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకొండి,,,, ఇక ముందుగా కూల్ సిమెంట్ కోటింగ్ అంటే ఒక రకం క్రిస్టల్స్ కలిపి ఉన్న పొడి, సాధారణ సిమెంటు మిశ్రమం తెలుపు రంగులో ఉండే ఈ సిమెంట్ సూర్యరశ్మి వేడిమిని పీల్చుకుని దానిని మన  గదిలోనికి ప్రవేశించకుండా చేస్తుంది, దానివల్ల పైకప్పు వేడెక్కదు. అందువల్ల ఇంటి లోపల ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇక మరొక పద్దతి ప్రకారం, ఇంటి లోపలి వైపు సీలింగ్ కు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కోటింగ్ వేయిస్తే పైకప్పు వేడి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది. లేదా ఇంట్లో పైకప్పుకు కొంచెం కిందుగా థర్మాకోల్ తో ఫాల్స్ సీలింగ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా ఇంట్లో చల్లదనం నెలకొంటుంది.
Image result for old year indian village homes
ముఖ్యంగా చిన్న ఇళ్ళు, ఆఫీసులు, చిన్న చిన్న కార్యాలయాల్లో ఇవి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటాయి. అలానే మన డాబా పైన ఖాళీని నేరుగా వదిలేయకుండా వాటిపై మొజాయిక్ టైల్స్ వంటివి వేయిస్తే కూడా పైకప్పు వేడవకుండా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో చల్లగా ఉంటుంది. అయితే ఇది మిగతావాటితో పోలిస్తే కొంత ఖర్చుతో కూడుకున్నది… ఇది ఇంట్లోని కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలను, నారతో తయారయ్యే చాపలను అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా ఉంటుంది. ఈ చాపలు వేడిని అడ్డుకుంటాయి. దాంతో ఇంట్లోకి చల్లటి గాలి వీస్తుంది. ముఖ్యంగా ఇంట్లోకి గాలి వీచే దిక్కుల్లో ఉన్న కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలు ఏర్పాటు చేసి, వాటిని ఎప్పటికపుడు నీటితో తడుపుతూ ఉండడం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత దాదాపుగా ఐదు డిగ్రీలకు పైగా తగ్గే అవకాశం ఉంటుంది. అలానే ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనినే  రూఫ్ టాప్ గార్డెన్ అంటారు. డాబాపై వీలైనంత వరకు గార్డెన్ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల పైకప్పు వేడెక్కకుండా ఇల్లు చల్లగా ఉంటుంది. అంతేగాకుండా మనకు కావాల్సిన కూరగాయలు, పూలు వంటివీ మనమే పండించుకున్నట్లూ ఉంటుంది.
Related image
ఇకపోతే ఇంట్లో నేరుగా ఎండ పడని దిశల్లో ఉన్న కిటికీలు, తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోకి గాలి ప్రవాహం పెరుగుతుంది. దానివల్ల కూడా చల్లదనం కలుగుతుంది. ఇదే సమయంలో ఎండ పడే దిశల్లో ఉన్న కిటికీలను మూసివేయడం, వీలైతే ఆ కిటీకీలకు బయటివైపు నుంచి కర్టెన్లు, తెరలు వంటివి ఏవైనా అడ్డుగా పెట్టడం మంచిది.
ఇక అన్నిటికంటే ముఖ్యంగా సాయంత్రం కాగానే అన్ని కిటికీలను తెరిచి ఉంచాలి. అందువల్ల ఇంట్లోని వేడిగాలి పూర్తిగా బయటికి వెళ్లిపోయి చల్లగాలి లోపలికి వస్తుంది. ఇక ఇంట్లో ఎక్కువ వేడిని ఉత్పత్తి అయ్యేది వంట గదిలోనే. వంట గదిలోని వేడి బయటికి వెళ్లిపోయేలా వంట గదికి వెంటిలేటర్ ఉండేలా చూసుకోవాలి. ఈ వెంటిలేటర్లకు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్లు వంటివి అమర్చుకోవాలి. ఆలా చేయడంవలన గదిలోని చాల వేడిమి బయటకు వెళ్లిపోవడం జరుగుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ చిన్నపాటి చర్యలతో రాబోయే ఎండాకాలంలో మన ఇంట్లో ఎసి, కూలర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు లేనప్పటికీ కూడా ఇంటిని ఎప్పుడు చల్లగా ఉంచుకుని వేసవి తాపం నుండి బయటపడొచ్చు….
Image result for plants in the roof

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here