ఈ లక్షణాలు మీలో ఉంటే, మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే జాగ్రత్త…!!

0
85
ప్రస్తుతం మనలో ఎక్కువమందిని పట్టి పీడిస్తున్న సమస్యల్లో కిడ్నీ లో రాళ్ల సమస్య ఒకటి. నిజానికి ఈ సమస్య వల్ల మూత్రానికి వెళ్లాలన్న, లేదా ఎక్కువసేపు నిలబడాలన్నా, కొంచెం మసాలా వంటి పదార్ధాలు తిన్నా విపరీతమైన మంట గా అనిపిస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ కు గురైతే చలితో కూడిన జ్వరం వస్తుంది. కొన్నిసార్లు వికారంగా, వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది.  అయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంశ పారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువని డాక్టర్లు చెపుతున్నారు. ఎక్కువగా మూత్రాశయ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కిడ్నీ స్టోన్లు ఏర్పడే అవకాశం ఉంది. దానివల్ల తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. మూత్రాశయంలో రాళ్లు ఉండటం వల్ల మూత్ర విసర్జన సాఫీగా సాగదు. ఒక్కసారి వెళ్లినా మళ్లీ వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇక ఈ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం చాలా మందిని వేధిస్తోన్న సమస్య. వేడి వాతావరణం, ఆహార అలవాట్ల కారణంగా భారతీయుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
Image result for kidney stones
మంచినీరు తక్కువగా తాగడం, కాల్షియం అధికంగా లభించే పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది. ఆక్సలైట్లు ఎక్కువగా ఉండే పాలకూర లాంటి ఆహారంతోపాటు, ప్రొటీన్లు తక్కువగా తీసుకోవడం కూడా సమస్యను పెంచుతోంది. రోజులో ఎక్కువసేపు పని చేయాల్సి రావడం, ఒబేసిటి, డయాబెటిస్ కారణంగానూ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలెక్కువ.. ఇక కిడ్నీల్లో రాళ్లు ఏర్పడిన తొలినాళ్లలో పొత్తి కడుపులో లేదా వెన్నులో నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి తగ్గుతూ పెరుగుతూ వుంటుందట. ఈ నొప్పి వృషణాల వరకు వ్యాపిస్తుంది. మూత్రం రంగు మారడంతోపాటు దుర్వాసన వస్తుంది. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా వచ్చే అవకాశం ఉంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా ఉండటంతోపాటు, మంట వస్తుంది. తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ పైన చెప్పిన వాటిలో మీలో కూడా ఏవైనా లక్షణాలు కనపడితే వెంటనే డాక్టరును సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here