ఆ మహాకావ్యం చదివితే, షుగర్ వ్యాధి మటుమాయం!

0
90
నిజానికి భగవద్గీత మనకు వినిపించిందంటే ఎవరో చనిపోయారనే అనుకోవాలి. అయితే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే వారికి, గీత ఉపయోగపడుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య నిపుణులతో పాటు బంగ్లాదేశ్ లోని ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ మిట్ఫోర్డ్ హాస్పిటల్ నిపుణులు అందరు కలిసి కరాచీలోని ఆగాఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్ నిపుణుల సాయంతో భగవద్గీత శ్లోకాల ప్రభావంపై అనేక మంది పేషెంట్ల మీద కొంత పరిశోధన చేశారు. ఇక వారి అధ్యయన ఫలితాలు ఇటీవల ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీలో పబ్లిష్ చేయడం కూడా జరిగింది. వారి పరిశోధనల ప్రకారం, గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన అంశాల ఆధారంగా పని నుంచి వెనక్కి లాగుతున్న నెగెటివ్ అంశాలు గుర్తింపులోకి వచ్చి పాజిటివ్ స్కిల్స్ గ్రహించడం జరుగుతుందని పరిశోధకుల బృందం అభిప్రాయపడింది.
"షుగర్ తగ్గాలంటే భగవద్గీత చదవండి"
ఇక మనలో ఎక్కువమంది బాధపడుతున్న డయాబెటిస్ వ్యాధి అనేది లైఫ్ స్టైల్ ద్వారా సంక్రమించే వ్యాధి అని, ఒకసారి ఆ వ్యాధి బారినపడితే మన లైఫ్ స్టైల్ మొత్తం మార్పు చేసుకోవాలని హెచ్చరించడమేనని వారు అభివర్ణిస్తున్నారు. ఇక షుగర్ కంట్రోల్ కోసం క్రమం తప్పని కసరత్తు, డైట్ వంటి బేసిక్ థింగ్స్ తోపాటు గీతాపారాయణం చేసినట్టయితే దాని ప్రభావం ఎంతో లాభదాయకంగా ఉంటుందట. అయితే  భగవద్గీత అనేది కేవలం ఒక్క మతానికి మాత్రమే పరిమితమైందే కాదని, అందులోని 700కు పైగా ఉన్న శ్లోకాలు మనిషిని అంతర్లీనమైన శక్తిని మేల్కొలిపి, అందువల్ల మనలో పాజిటివిటీ పెరుగుతుందని వారంటున్నారు. ఇక డయాబెటిక్ పేషెంట్లు రోజూ ఆ శ్లోకాలు వినడం ద్వారా మానసిక, శరీరకోల్లాసాలు కలుగుతాయట. ప్రతి రోజూ ఇన్సులిన్ తీసుకున్నా, ఎన్ని నియమాలు పాటించినా కూడా షుగర్ కంట్రోల్ కానివారికి గీత చక్కగా పనిచేస్తుందంటున్నారు.  సో మరి చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధానాన్ని పాటించి చక్కని ఆరోగ్యాన్ని పొందండి మరి ……..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here