ఈ సింపుల్ నాచురల్ క్రీం వాడితే మీరు యంగ్ గా కనపడడం ఖాయం…!

0
87
మనం అందంగా కనపడాలంటే కేవలం ఆహారపు అలవాట్లు మాత్రమే మార్చుకుంటే సరిపోదని, మన సౌందర్య పోషణకు సరిపడే మంచి సహజసిద్ధమైన పధార్ధాలతో చేయబడే క్రీంలు వాడితే మన మొహం ఎప్పుడు కాంతివంతంగా వుండి, ఎంత వయసుమీద పడ్డాకాని, ఎప్పుడూ యవ్వనంగా కనపడవచ్చని నిపుణులు చెపుతున్న మాట. అయితే అందుకోసం పెద్దగా కష్టపడి వలసిన అవసరం లేదు. ముందుగా కొన్ని బాదం పప్పులు తీసుకుని, వాటిని 10 నుండి 12 గంటలపాటు నానబెట్టి, తరువాత వాటిపై తొక్క తీసేసి, మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఇక పేస్ట్ అయినాదానిని ఒక చిన్న బౌల్ లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక పొయ్యి మీద చిన్న బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి, దానిపై ఈ బాదం పేస్ట్ చేసిన బౌల్ ని ఉంచి డబుల్ బాయిల్ చేయాలి.
Related image
తరువాత కాసేపటికి ఆ బౌల్ పొయ్యి మీద నుండి దించి, చల్లారాక అందులో ఒక స్పూన్ అలోవెరా జెల్, ఒక స్పూన్ నాచురల్ కొబ్బరి నూనె కలిపి బాగా పేస్ట్ చేసి, దానిని ఒక వారం రోజుల పాటు గాజు సీసాలో నిల్వవుంచి ఆపై, రోజూ ఉదయం మరియు సాయంత్రం రాసుకుంటే మీ మోహంలోని ముడతలు మెల్లగా పరార్ అని అంటున్నారు. ఇక మరొకటి ఏంటంటే, ఒక స్పూన్ మిల్క్ క్రీం, ఒక స్పూన్ గ్లిజరిన్, ఒక స్పూన్ రోజ్ వాటర్, ఒక రెండు విటమిన్ ఈ క్యాసుల్స్, ఇలా ఇవన్నీ ఒక చిన్న బౌల్ లోకి తీసుకుని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగ అయ్యాక దానిని ఒక వారంరోజుల పాటు నిల్వ చేసుకుని, రోజు రాత్రిపూట పడుకునే ముందు ఆ క్రీంని మన ముఖానికి కనుక అప్లై చేస్తుంటే కొద్దిరోజుల్లో ఆశ్చర్యం కలిగించే విధంగా ముఖంలో అనూహ్యంగా ముడతలు, మచ్చలు పోయి మొహం పాలు కారుతూ ఎంతో కాంతివంతంగా కనపడుతుంది. సో విన్నారుగా మనకు ఎంతో ఉపయోగపడే ఈ చిట్కాను మీరు కూడా పాటించి దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపములో తెలియచేయండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here