ఎత్తు పెరిగేందుకు ఈ విధంగా చేస్తే, అద్భుత ఫలితాలు మీ సొంతం!

0
58
నిజానికి మనలో చాలామంది, అవతలివారిలో అందచందాలతో పటు ఎత్తును కూడా చూస్తూ ఉంటారు. అయితే ఎత్తు అనేది ఒక మనిషి యొక్క కొలమానం కానప్పటికీ కొందరు మాత్రం దానిని కొంత ప్రెస్టేజ్ గా భావిస్తుంటారు.   అయితే ఒక మనిషి ఆరడుగుల ఎత్తు ఎదగడానికి, పొట్టిగా ఉండడానికి వారి జన్యు సంబంధిత అంశాలు, పర్యావరణ, ఇతర అంశాల ప్రభావం ఉంటుంది. ఒక్కసారి గ్రోత్ ప్లేట్స్ మూసుకుపోయాయంటే ఇక ఆ తర్వాత వారి ఎత్తు అంతటితో నిలిచిపోయినట్టే. ఇవి మూసుకుపోకముందే పొడవు పెరిగేందుకు తమ వంతు కృషి చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశాలున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.   అయితే మీ  ఎత్తును మీ కుటుంబ సభ్యుల భిన్న రకాల జన్యువులే నిర్దేశిస్తాయి.  వీటినే పాలీజెనిక్ అంటారు. తల్లి, దండ్రి ఇద్దరూ పొట్టిగా ఉంటే వారికి పుట్టే పిల్లలు పొట్టిగా ఉండాలనేం లేదు. అలాగే, తల్లిదండ్రులు పొడువుగా ఉంటే వారి పిల్లలు పొడవుగా ఉంటారని కచ్చితంగా చెప్పడానికి లేదు. ఇరువైపుల వారు పొట్టిగా ఉంటే మాత్రం పుట్టే పిల్లలు ఎత్తు తక్కువగానే ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి.
తమంతట తామే ఎత్తు పెంచుకుందామంటే అందుకు పెద్దగా అవకాశాల్లేవు. కానీ, సహజ ఎత్తు పెరిగేందుకు అడ్డు పడే అంశాలను నియంత్రించడం ద్వారా ఫలితం పొందొచ్చు. పోషకాహార లోపం ఉంటే పూర్తి స్థాయి ఎత్తు ఎదగలేరు. డ్రగ్స్, ఆల్కహాల్ ఎదుగుదలను నిరోధించేవి. కెఫైన్ నేరుగా ఎదుగుదలపై ప్రభావం చూపించదు. కానీ, శారీరక ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే నిద్రను ఇటువంటివి దూరం చేస్థాయి. కొలంబియా యూనివర్సిటీ ఇంటర్నెట్ హెల్త్ రీసోర్స్ పరిశోధనా ఫలితాల ప్రకారం, పొగతాగినా, ఇతరులు తాగి వదిలిన పొగను పీల్చినా శారీరక పొడవుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిర్ధారణ అయింది. ఇక స్టెరాయిడ్స్ ఔషధాల వినియోగం వల్ల కూడా ఎత్తుపై ప్రభావం పడుతుంది.    హ్యుమన్ గ్రోత్ హార్మోన్ అనేది మన శరీరంలో పిట్యూటరీ గ్రంధిలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా నిద్ర సమయంలోనే ఇది చురుగ్గా ఉంటుంది. మంచి నిద్ర వల్ల హ్యుమన్ గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. కొన్ని కేసుల్లో హెచ్ జీహెచ్ ను మందుల ద్వారా వైద్యులు సూచించొచ్చు. వీటివల్ల దుష్ప్రభావాలు అధికం.   పొడవు పెరిగేందుకు కీలకమైన అంశాల్లో పోషకాహారం కూడా ఒకటి. అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ అందేలా చూసుకోవాలి. సరైన పోషకాహారం అందడం లేదని భావిస్తే వైద్యుల సూచనతో సప్లిమెంట్లను తీసుకోవాలి.
చిన్నారులకు కార్బోహైడ్రేట్స్, కేలరీలు, క్యాల్షియం అధికంగా అవసరం అవుతాయి.  శారీరక ఎదుగుదలలో ఎముకల వృద్ధి కీలకం. చిన్నారుల్లో ఎముకలు, కండరాల వృద్ధికి విటమిన్ డి తోడ్పడుతుంది. పండ్లు, పాలకూర, క్యారట్స్ కూడా ఆహారంలో భాగం చేయాలి.శరీరానికి సరైన ఇంధనం అందితే అన్ని రకాల వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. రక్త సరఫరా మెరుగై, అధిక మెటబాలిక్ రేటుతో, ఎముకలు బలంగా, పొడవుగా తయారవుతాయి. ఇవన్నీ సరైన సమతుల, పోషకాహారంతో సాధ్యం. అలా అని బాగా దండిగా తినేసి శరీర బరువును పెంచుకోవడం కాదు. బరువు అధికమైతే ఎత్తుకు ప్రతిబంధకం అని తెలుసుకోవాలి.  రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా సరైన పోషకాహారం, తగినంత నిద్ర, నిరంతరం వ్యాయామం రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కొన్ని రకాల వ్యాధులు ఎదుగుదలకు అడ్డు పడతాయి. అందుకే ఆయా వ్యాధులపై పోరాడడానికి గాను రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా అందేలా చూసుకుంటే అది రోగ నిరోధక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతుంది. విటమిన్ సి కమలా, బత్తాయి, నిమ్మ, ద్రాక్ష పండ్లలో సమృద్దిగా లభిస్తుంది. ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు, కేలరీలు లేని ఆహారం, ఫ్యాట్ అధికంగా ఉండే వాటిని దూరంగా ఉంచాలి.  శారీరక వ్యాయామాలు ఎత్తు ఎదిగేందుకు చక్కగా సాయపడతాయి. కొందరిలో 20-25 ఏళ్ల వరకు వ్యాయామాల కారణంగా ఎత్తు పెరిగేందుకు అవకాశాలుంటాయి. స్ట్రెచింగ్ వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి. మనిషి పొడవు పెరిగేందుకు ఈత సాయపడుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి. తాడుతో స్కిప్పింగ్ చేయడం కూడా ఎత్తు పెరిగే వ్యాయామాల్లో ఒకటిగా పేర్కొంటారు. రక్త సరఫరా మెరుగుపడి ఎముకలపై ఒత్తిడి పడేలా చేసి పొడవు పెరిగేందుకు సాయపడుతుంది.
కనీసం 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు స్కిప్పింగ్ చేయాలి. బాస్కెట్ బాల్, టెన్నిస్ సైతం పిల్లలు పొడవు పెరిగేందుకు దోహదం చేస్తాయి. పులప్స్ కూడా ఎత్తు పెరిగేందుకు సాయపడే వ్యాయామమే. ఫ్లోర్ పై నిటారుగా నించుని శరీరాన్ని పక్కకు వంచి 15 సెకండ్ల పాటు అలానే ఉంచేసిన తర్వాత తిరిగి నిటారుగా రావాలి. అలాగే, మరోవైపునకూ శరీరాన్ని బెండ్ చేసి ఇంతే చేయాలి.  డుమును ముందుకు వంచి చేతులతో నేలను పట్టుకోవాలి. ఈ సమయంలో మోకాళ్లు వంగకుండా చూసుకోవాలి. దీంతో స్పైన్ కు సాగే గుణం అలవడుతుంది. క్రీడలు పిల్లల్లో ఎదుగుదలను ఎంతగానో ప్రేరేపిస్తాయి. అయితే, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే టీనేజీ, మధ్య వయసు నాటికి సరైనంత పొడవు పెరగకుంటే వైద్యులను సంప్రదించడం అవసరం. ఎందుకంటే వైద్యులు గ్రోత్ హార్మోన్ లోపించిందా, లేక రోగనిరోధక వ్యవస్థ బలహీనపడిందా, లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్నది గుర్తించి చికిత్స సూచిస్తారు. ఆ ప్రకారంగా కనుక వారి సలహాలు, సూచనలు పాటిస్తే కొంతవరకు పొడవు పెరిగే అవకాశం ఉంటుంది……….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here