నేటి బడ్జెట్ లో ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్… మ్యాటర్ ఏంటంటే?

0
99
తాత్కాలిక కేంద్ర ఆర్ధిక మంత్రి పీయూష్ గోయల్ మధ్యతరగతి ఆదాయవర్గాల వారికి ఎంతో ఊరటనిచ్చే అంశాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక వారిలో ముఖ్యంగా వేతన జీవులు, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఆదాయపు పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ ప్రకటన గోయల్ నోటి నుంచి వెలువడిన వెంటనే నరేంద్ర మోదీతో సహా సభ్యులంతా బల్లలు చరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. సంవత్సరానికి రూ.5 లక్షల వరకు జీతం సంపాదించేవారికి ఎటువంటి పన్ను ఉండదని గోయల్ ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.
Related image
అంతేకాక పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితి రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. పోస్టల్‌, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్‌ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎస్‌ పరిమితి రూ. 10 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌లో ప్రకటించారు. ఇది నిజంగా మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఊరటనిచ్చే విషయమని, అలానే తమది పేదల పక్షపాత ప్రభుత్వం అని దీనిద్వారా మరొక్కసారి నిరూపించుకున్నాం అని ప్రధాని మోడీ బడ్జెట్ అనంతరం ప్రసంగిస్తూ తెలిపారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here