ఆస్ట్రేలియాతో ఫస్ట్ వన్డే లో పోరాడి ఓడిన ఇండియా…!

0
36
ఇటీవల ఆసీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ దక్కించుకున్న టీమ్ ఇండియా, ప్రస్తుతం వారితో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో పాల్గొంటోంది. ఇక అందులోభాగంగా నేడు జరిగిన మొదటి వన్డేలో భరత్ పై ఆసీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 34 పరుగుల తేడాతో కంగారులు విజయం సాధించారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 254 పరుగులు మాత్రమే చేసి అభిమానులను నిరాశపరిచింది.
Image result for india vs australia odi
అయితే ఆసీస్ బ్యాట్స్మన్ లలో  పీటర్ హ్యాండ్స్ కొమ్బ్ (73), ఉస్మాన్ ఖవాజా (59), షాన్ మార్ష్ (54) పరుగులు చేసారు… ఇక భారత బ్యాట్స్మన్ లలో రోహిత్ శర్మ(133), ధోనీ(51) పరుగులు చేసి మ్యాచ్‌ను ఆదుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్ 4 వికెట్లు, బెహ్రాండార్ఫ్, స్టోయినిస్ చెరో రెండు వికెట్లు, పీటర్ ఒక వికెట్ తీయగా, భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. కాగా తదుపరి రెండవ వన్డే 15వ తేదీన ఓవల్ లో జరుగనుంది….