నాలుగో టెస్ట్ లో గెలుపు దిశగా ఇండియా…. పీకల్లోతు కష్టాల్లో ఆసీస్!

0
88
ప్రస్తుతం ఇండియాతో జరుగుతున్న చివరి నాలుగవ టెస్టులో ఆసీస్‌ జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా 622/7 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ స్కోర్ ని ఎదుర్కోవడానికి బరిలోకి దిగిన ఆసీస్ బ్యాట్స్ మాన్ ఆదినుండి తడబడుతూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇండియన్ బౌలర్ల విజృంబణ తో ఆ జట్టు కేవలం 198 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయి ఎదురీదుతోంది. 24/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం ఆటను కొనసాగించిన ఆసీస్‌, 72 పరుగుల వద్ద 27 పరుగులు చేసిన ఉస్మాన్‌ ఖవాజా వికెట్‌ను కోల్పోయింది. ఇక మొదటి సెషన్‌లో భారత్‌కు పరీక్షగా నిలిచిన ఖావాజాను కుల్దీప్‌ యాదవ్‌ బోల్తా కొట్టించడంతో ఆసీస్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆపై బ్యాటింగ్ వచ్చిన వారిలో హ్యారిస్ 79 పరుగులు చేయగా, మిగిలిన వారిలో స‍్పల్ప వ్యవధిలో షాన్‌ మార్ష్‌(8), లబూస్కాంజ్‌(38)లు ఔట్‌ కావడంతో ఆసీస్‌ 152 పరుగులకే నాలుగు వికెట్లను చేజార్చుకుంది.
Image result for india vs australia 4th test
ఇక టీ విరామం తర్వాత టిమ్‌ పైన్‌(5)ను కుల్దీప్‌ ఔట్ చేయడంతో ఆసీస్‌ మరింత కష్టాల్లోకి వెళ్లింది. ఆసీస్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో్ కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా, జడేజా రెండు వికెట్లు తీశాడు. మహ్మద్‌ షమీకి వికెట్‌ లభించింది.  ఇక ప్రస్తుత బ్యాటింగ్ పరిస్థితి బట్టి చూస్తే ఆసీస్‌ ఫాలో ఆన్‌ ప్రమాదంలో పడకుండా ఉండాలంటే తొలి ఇన్నింగ్స్‌లో 423 పరుగులు చేయాలి. ఆసీస్‌ రెండొందల పరుగుల లోపే సగానికి పైగా వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుకు ఫాలో ఆన్‌ తప్పేలా లేదు. ఇక క్రికెట్ విశ్లేషకులు మాత్రం ఈ టెస్ట్ లో ఆసీస్ విజయం కష్టమే అని, దీన్నిబట్టి చూస్తే ఈ సిరీస్ చాలావరకు ఇండియా కు లభించే అవకాశం ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here