ఆసీస్ పై మూడో వన్డేలో అద్భుత విజయం….. సిరీస్ దక్కడంతో ఆనందంలో టీమ్!

0
88
ఆస్ట్రేలియాపై పరిపూర్ణ విజయం. తొలుత 1-1తో టీ20 సిరీస్‌ సమం. తర్వాత 2-1తో టెస్టు సిరీస్ కైవసం. ఇప్పుడు 2-1తో వన్డే సిరీస్‌ భారత్‌ సొంతం. నిజానికి ఎన్నో ఏళ్ల కలగా వున్న ఆసీస్ ను సొంతగడ్డపై మట్టికరిపించాలి అనేది మొన్నటి టెస్ట్ సిరీస్ దక్కడంతో భారత జట్టు ఆ కల నెరవేర్చింది. ఇకపోతే ఓ పటిష్ఠ జట్టుపై విదేశాల్లో టీమిండియా అన్ని సిరీస్‌లను కోహ్లీ నాయకత్వంలోనే అందుకోవడం అద్భుతం అనే చెప్పాలి. ఇక మూడు వన్డే సిరీస్ లో భాగంగా నేడు జరిగిన నిర్ణయాత్మక చివరి వన్డే కి భారత జట్టు అనూహ్య విజయాన్ని అందుకుని వన్డే సిరీస్ ని కూడా తమ ఖాతాలో వేసుకుంది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు, స్పిన్నర్ యుజువేంద్ర చాహల్‌ 6/42 చెలరేగడంతో ఆసీస్‌48.4 ఓవర్లకు 230 పరుగులు చేసింది. ఇక ఆ స్కోర్ ఛేజింగ్ లో భాగంగా భారత జట్టు  49.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
Image result for ind vs aus
ఇక భారత బ్యాట్స్ మాన్ లో మహేంద్రసింగ్‌ ధోనీ (87; 114 బంతుల్లో 6×4), కేదార్‌ జాదవ్‌ (61; 57 బంతుల్లో 7×4) అజేయంగా నిలిచారు. నాలుగో వికెట్‌కు 116 బంతుల్లో 121 పరుగుల భాగస్వామ్యం అందించారు. విరాట్‌ కోహ్లీ (46; 62 బంతుల్లో 3×4) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (9; 17 బంతుల్లో 1×4) జట్టు స్కోరు 15 వద్ద మొదట్లోనే వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన భారత సారథి విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఇక జట్టు స్కోరు 59 వద్ద ధావన్‌ (23; 46 బంతుల్లో)ను స్టాయినిస్‌ ఔట్‌ చేయడంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఇకపోతే చివరి ఐదు ఓవర్లలో భారత్‌ 44 పరుగులు చేయాల్సి ఉండగా కేదార్‌ జాదవ్‌ సమయోచితంగా వరుస బౌండరీలు సాధించి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. చివరి 12 బంతుల్లో 14 పరుగులుగా మారడంతో భారత్‌ విజయం ఖాయమైంది. స్టాయినిస్‌ వేసిన 49 ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 49.2వ బంతికి జాదవ్‌ బౌండరీ సాధించి విజయం అందించారు. కాగా చాహల్‌ మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌, మరియు ధోనీ మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ అందుకున్నారు. నిజంగా ఈ విజయం భారత ప్రజలకు అంకితమని కెప్టెన్ విరాట్ అన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here