న్యూజిలాండ్ తో నాలుగో వన్డేలో పూర్తిగా చతికిలబడ్డ ఇండియా… స్కోర్ ఎంతంటే?

0
62
మన భారత క్రికెట్ టీమ్ పై మొదటి నుండి ఒక అపవాదు వుంది. ,అదేమిటంటే స్వదేశీ గడ్డపై విరుచుకుపడే భారత ఆటగాళ్లు, విదేశీ గడ్డపై మాత్రం చాలావరకు తడపడుతుండడం. అయితే దాదాపుగా మన టీమ్ పలు మార్లు ఇతర దేశాల్లో జరిగే ట్రోఫీలు కైవశం చేసుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, న్యూజిలాండ్ వంటి దేశాల పిచ్ లపై కొంత తడపడుతూ వుంటారు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ తో జారుతున్న నాలుగో వన్డేలోను అచ్చంగా అదే జరిగింది. తొలి మూడు వన్డేలు ఆడుతుపాడుతూ గెలిచిన టీమిండియా నాలుగో మ్యాచ్‌లో మాత్రం ఘోరంగా తడబడింది. కివీస్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(5/21), గ్రాండ్‌ హోమ్‌(3/26) బౌలింగ్‌ దెబ్బకు భారత బ్యాట్స్‌మెన్‌ విలవిల్లాడారు. ఇక కివీస్ బౌలర్ ల ధాటికి మన బాట్స్మన్ 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు. పాండ్యా(16) చహల్‌(18), కుల్దీప్‌(15)లు చివర్లో రాణించడంతో ఆమాత్రం స్కోరయినా టీమిండియా సాధించగలిగింది.
Image result for india vs new zealand
ఓ దశలో క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌కే టీమిండియా ఆలౌటవుతుందా అనే అనుమానాన్ని బ్యాట్స్‌మెన్‌ కలిగించారు. ఇక ఈ స్కోర్ తో తోమ్మిదేళ్ల అనంతరం అత్యల్ప స్కోర్‌కు ఆలౌటైన రికార్డును  ఇండియా నెలకొల్పింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియాకు తొలి 5 ఓవర్లు మాత్రమే ఆనందాన్ని కలిగించాయి. వీస్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ధావన్‌ (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. రోహిత్‌ శర్మ(6) రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. దీంతో 23 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది అనంతరం రాయుడు(0), కార్తీక్‌(0)లు గ్రాండ్‌ హోమ్‌ బౌలింగ్‌లో వెంటవెంటనే ఔటయ్యారు. శుబ్‌మన్‌ గిల్‌(9)  జాదవ్‌(1) తో అభిమానులను పూర్తిగా నిరాశ పరిచారు. ఇక  ఈ అత్యల్ప స్కోర్ ని కివీస్ జట్టు ఎంతో సునాయాసంగా ఛేదిస్తుందని భారత క్రికెట్ ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here