ఆసీస్ పై సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా……! 

0
77
ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ అభిమానులు అందరూ పట్టలేనంత ఆనందంలో ఉన్నారనే చెప్పాలి… ఇకపోతే ఎన్నో దశాబ్దాల టీమిండియా కల నేటికీ నెరవేరింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్‌ గెలిచి మన చరిత్రని ప్రపంచానికి చాటింది.  ఇక ఆస్ట్రేలియా తో 4 టెస్టు సిరీస్‌ లో భాగంగా నిన్న జరిగిన నాలుగవ టెస్ట్ లో డ్రా గా ముగియడంతో టీమ్ ఇండియా జట్టు 2-1 తేడాతో సిరీస్ ని కైవసం చేసుకోవడంతో 72 ఏళ్ల  మన క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఇక ప్రస్తుతం జరిగిన  బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని కోహ్లీ సేన విదేశీగడ్డ పై తమ సొంతం చేసుకుని సత్తా చాటింది. ఇక  గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ సిరీస్‌ను డ్రా చేసుకుంది.
Image result for india vs australia 4th test winning
ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి.  3-1తో ముగించాలనుకున్నా మధ్యలో వాన అంతరాయం కలిగించడంతో ఆఖరి రోజు ఆట రద్దై చివరి టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్‌ను 3-1తో ముగించాలన్న భారత ఆశలు మాత్రం నెరవేరలేదు. ఇకపోతే ఈ సిరీస్‌లో మూడు సెంచరీలు నమోదు చేసిన భారత నయావాల్‌ పుజారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను గెలుచుకున్నాడు.  భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ -662/7 డిక్లేర్డ్‌, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్  300కి ఆల్ అవుట్,,, ఫాలోఆన్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగోరోజు వర్షం రావడంతో మ్యాచ్ ను డ్రా గా ముగించడం జరిగింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here