ఆసీస్ బౌలర్లను ఉతికారేసి, భారీ స్కోర్ చేసిన ఇండియా!

0
78
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో భారత క్రికెట్ జట్టు ఆడుతున్న నాలుగవ టెస్టులో భాగంగా నేటి రెండవ రోజు మొత్తం 622 పరుగులకు 7 వికెట్ల భారీ స్కోర్ చేసింది…. ఇక ఆటలో రెండవ రోజైన శుక్రవారం 303/4 తో ఆటను ఆరంభించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో మన బ్యాట్స్మన్ లు దాదాపుగా అందరూ ప్రధాన ఆసీస్ బౌలర్లను చీల్చి చెండాడారు అనే చెప్పాలి. వారిలో నాథన్ ల్యాన్ 178 పరుగులివ్వగా, మిచెల్ స్టార్క్ 123, జోష్ హాజెల్ వుడ్ 105, ఫ్యాట్ కమిన్స్ 101 పరుగులు మన బ్యాట్స్ మాన్ కు సమర్పించుకున్నారు.
Image result for india vs australia 4th test
నిజానికి మొదటి రోజునుండి కాస్త దూకుడుగానే తమ బ్యాటింగ్ ని ఆరంభించిన ఇండియా జట్టు, ఆ తరువాత ప్రధాన బ్యాట్స్మన్ లు పుంజుకోవడంతో ఇంత స్కోర్ చేయగలిగింది. మన బ్యాట్స్ మాన్ లలో పుజారా 373 బంతుల్లో 193 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 189 బంతుల్లో 159 పరుగులు, రవీంద్ర జడేజా 114 బంతుల్లో 81 పరుగులు, మయాంక్ అగర్వాల్ 112 బంతుల్లో 77 పరుగులు చేసారు. కాగా నేటి ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 10 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 24 పరుగులు చేసింది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here