ఫోటోలు క్లియర్ గా రావాలంటే పిక్సెల్ ముఖ్యమా, లేక రెజోల్యూషనా? 

0
118
ఈ మధ్య మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ ని కేవలం ఫోన్ గా మాత్రమే కాకుండా, చక్కని ఫోటోలు తీయడానికి కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఆ విధంగా కొన్ని   స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో కెమెరా పిక్సల్స్ ను హైలైట్ చేయడం గమనించే ఉంటారు. 18 మెగా పిక్సల్స్, 23 మెగా పిక్సల్స్ అంటూ పెద్ద అక్షరాలతో కంపెనీలు ప్రకటనలు ఇస్తుంటాయి. అన్నేసి మెగా పిక్సల్స్ చూడ్డానికి మంచిగానే కనిపిస్తాయి. అయితే, స్మార్ట్ ఫోన్ కెమెరా లెన్స్ గురించి మాత్రం ప్రకటనల్లో ఎక్కడా కనిపించదు. ఫోన్ కంపెనీలు కెమెరా సెన్సార్లను, కెమెరా లెన్స్ లను విడిగా సమకూర్చుకుని రెండింటినీ ఫోన్లో అమర్చుతుంటాయి. లెన్స్ లతో పోల్చుకుంటే కెమెరా సెన్సార్లు చౌకగా ఉంటాయి. చౌకగా వస్తుండడంతో సాధారణంగా ఎక్కువ ఫోన్లలో అధిక రిజల్యూషన్ తో కూడిన కెమెరా సెన్సార్ ను, ఖరీదు ఎక్కువగా ఉండడంతో తక్కువ రిజల్యూషన్ ఉన్న లెన్స్ ను ఏర్పాటు చేస్తున్నాయి. లెన్స్ రిజల్యూషన్ తక్కువ కావడం వల్ల కెమెరా రిజల్యూషన్ ఎక్కువ ఉన్నప్పటికీ అది పరిమితమవుతోంది. దీంతో వాస్తవంగా చూస్తే ఫొటో రిజల్యూషన్ తక్కువగా వస్తుంది.  డిజిటల్ ఫొటోగ్రఫీలో రిజల్యూషన్ చాలా ముఖ్యమైంది. రిజల్యూషన్ కెమెరా సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.
representational imageఫొటో తీసినప్పుడు వస్తువు లేదా మూలకం వివరాలు సుస్పష్టంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు పార్క్ లో ఫొటో తీశారనుకోండి. అందులో ప్రతీ గడ్డి పరక, మొక్క, ఆకులు, పువ్వులు అన్నీ చాలా స్పష్టంగా ఉంటేనే ఉపయోగకరం. ఇందుకు మంచి సామర్థ్యం ఉన్న కెమెరా కావాలి.  ఇక ఓ దృశ్యంలో ఎన్ని పిక్సల్స్ ఉన్నాయనేది రిజల్యూషన్ లో పేర్కొంటారు. ఓ ఇమేజ్ ఎత్తు, వెడల్పు ఆధారంగా అది ఎంత రిజల్యూషన్ ను కలిగి ఉందో చెప్పొచ్చు. ఉదాహరణకు ఓ ఇమేజ్ 2048 పిక్సల్స్ వెడల్పు, 1536 పిక్సల్స్ ఎత్తు ఉందనుకుంటే ఈ రెండింటినీ హెచ్చవేస్తే 31,45,728 వస్తుంది. ఇన్ని పిక్సల్స్ ఆ చిత్రంలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇది 3.1 మెగా పిక్సల్స్ తో సమానం. ఒక మెగా పిక్సల్ అంటే పది లక్షల పిక్సల్స్. ఈ ఫొటోను 2048X1536 అని కూడా చెప్పొచ్చు. మెగా పిక్సల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ సైజులో చిత్రాన్ని షూట్ చేసుకునే వీలుంటుంది. పీపీఐ (పిక్సల్స్ పర్ ఇంచ్) అన్నది ఒక అంగుళం విస్తీర్ణంలో ఉండే పిక్సల్స్ ను సూచించేది. స్మార్ట్ ఫోన్లలో స్క్రీన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లలో ఇది కనిపిస్తుంది. లెన్స్ లలో చాలా ముఖ్యమైన అంశం డయామీటర్ (వ్యాసార్థం). ఒక లెన్స్ లో ఇతర అంశాలన్నీ పక్కాగా ఉండి, డయామీటర్ చిన్నగా ఉంటే తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే డయామీటర్ అన్నది రిజల్యూషన్ ను పరిమితం చేయగలదు. లెన్స్ ఎంత వెలుగును సేకరించగలదు? అనేది డయామీటర్ పైనే ఆధారపడి ఉంటుంది. లెన్స్ లు పెద్దగా ఉండి, అధిక రిజల్యూషన్ కలిగినవి అయితే ఎక్కువ వెలుగును సేకరిస్తాయి. సాధారణంగా డిజిటల్ కెమెరా లెన్స్ లు 10ఎంఎం నుంచి 50ఎంఎం వరకు ఉంటాయి.
Image result for cell phone camera
కెమెరా అపెర్చూర్ కూడా అత్యంత కీలకమైనది. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ ఫోన్లలో దీని ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. చాలా ఫోన్లలో అపెర్చూర్ ఎఫ్2.2 లేదా ఎఫ్1.8 ఉంటున్నవి. పిక్చర్ నాణ్యత విషయంలో అపెర్చూర్ నంబర్ కు ప్రాధాన్యం ఉంది. ఫొటోగ్రఫీ అంతా వెలుగుపైనే ఆధారపడి ఉంటుందని తెలిసిందే. ఒక కెమెరా ఎంత వెలుగును సంగ్రహిస్తుంది (క్యాప్చరింగ్) అనే దాని ఆధారంగా దాని క్వాలిటీని చెప్పొచ్చు. స్మార్ట్ ఫోన్లలో లెన్స్ లు, సెన్సార్లు చిన్నగా ఉంటాయి. దీంతో వాటిలోకి తక్కువ వెలుగు వెళుతుంది. దీంతో తుది చిత్రం నాణ్యతపై ప్రభావం పడుతుంది. ఎంత వెలుగు లెన్స్ ద్వారా  పిక్సల్స్ ను చేరుతుందన్నది కెమెరా క్వాలిటీకి ముఖ్యం. అపెర్చూర్ అన్నది దీన్ని నిర్ణయిస్తుంది. వేగంగా వెళుతున్న దాన్ని ఫొటో తీయాలనుకుంటే అది సరిగా రాకపోవడం చాలా మందికి అనుభవమే. ఎందుకంటే చాలా వరకు ఫోన్లలో సీఎంఓఎస్ సెన్సార్లను వాడేస్తున్నారు.  ఈ సెన్సార్లు చిత్రాలను ఒక లైన్ తర్వాత లైన్ రూపంలో క్యాప్చర్ చేస్తాయి. అదే ఖరీదైన సీసీడీ ఇమేజ్ సెన్సార్లు అయితే అన్నింటినీ ఒకేసారి క్యాప్చర్ చేప్తాయి.   ఫోటోలు మంచిగా రావాలనుకునేవారు కెమెరా సెట్టింగ్స్ లో ఐఎస్ వో ఆప్షన్ ను తప్పకుండా పరిశీలించాల్సినది. ఇది కెమెరా సెన్సిటివిటీని నిర్ణయించేది. లైటింగ్ తక్కువ ఉన్న సమయంలో, మేగావృతమై చీకటిగా మారినప్పుడు ఫొటోల నాణ్యత పడిపోతుంది. ఉదాహరణకు సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నారు. ఆ సమయంలో ఫొటో తీస్తే ఎలా వస్తుంది? బ్లర్ గా ఉంటుంది. కానీ, ఫోన్ కెమెరా సెట్టింగ్స్ లోకి వెళ్లి ఐఎస్ఓను ఆటోమోడ్ లో పెట్టి చూడండి. ఫొటో తీసుకోండి. ఆ తర్వాత ఐఎస్ఓను ఆఫ్ చేసి చూడండి. రెండింటి మధ్య తేడా మీకే తెలుస్తుంది.
Image result for cell phone camera

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here