తమన్నా ఆరోగ్య పరిస్థితి బాలేదా?….. వైరల్ అవుతున్న న్యూస్… మ్యాటర్ ఏంటంటే!

0
95
మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా, ఆ తరువాత శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమాతో మంచి పేరు సంపాదించింది. ఇక అక్కడినుండి వరుసగా అవకాశాలు కొల్లగొడుతూఊ వెళ్లిన ఆమె, తరువాత దాదాపుగా అందరూ స్టార్ హీరోల సరసన నటించారు. ఇక ఇటీవల కొద్దికాలంగా సరైన సక్సెస్ లేని ఆమె, కొద్దిరోజుల క్రితం విడుదలైన ఎఫ్2 సినిమా విజయంతో తమన్నా మళ్ళి లైమ్ లైట్ లోకి వచ్చింది.
Related image
అయితే తమన్నా కొద్దిరోజుల క్రితం ముంబై లోని ఒక ఆసుపత్రిలో హెల్త్ చెకప్ చేయించుకోగా ఆమెను కొన్నాళ్లపాటు షూటింగ్స్ చేయకుండా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారట. అయినప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా తమన్నా ఇప్పటికీ తన షూటింగ్స్ కి విరామం లేకుండా పాల్గొంటున్నారని, అందువల్ల ఆమెకు శారీరకంగా, మానసికంగా మళ్ళి ఇబ్బందులు తలెత్తాయని సమాచారం. అందువల్ల మరొక్కసారి డాక్టారుని సంప్రదించిన తమన్నా, వారి సూచన మేరకు ఇంటివద్దనే ఉండి కొద్దిరోజలు రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించి, కొన్నాళ్ల పటు షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిందట. ఇక ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here