మీడియా పై ఫైర్ అయిన జబర్దస్త్ నరేష్… మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
119
ప్రస్తుతం జబర్దస్త్ షో ఈటీవీలో ప్రదర్శితమయ్యే షోలన్నిటిలోకి ఒకింత అత్యధిక రేటింగ్స్ మరియు ప్రేక్షకాధరణతో దూసుకెళ్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇకపోతే ఈ షోలో తమ స్కిట్స్ తో మంచి పేరు సంపాదించి, ఆ తరువాత మెల్లగా సినిమా అవకాశాలు దక్కించుకున్నవారు అనేకమంది వున్నారు అనే చెప్పాలి. ఇక ఈ షోలోని వారందరిలో తనకంటూ కొంత ప్రత్యేకత సంతరించున్న వ్యక్తి పొట్టి నరేష్. మొదట్లో తన డాన్సులతో స్నేహితులను ఆకట్టుకున్న నరేష్, మెల్లగా అవకాశలకోసం అన్నపూర్ణ స్టూడిలో వద్ద తిరిగేవాడట, అయితే అనుకోకుండా నరేష్ స్నేహితుడొకడు అతని డాన్స్ ని మరియు కామెడీ స్కిట్స్ ని జబర్దస్త్ ఫేమ్ బులెట్ భాస్కర్ కి చూపించారట. అవి చూసిన భాస్కర్, ఇతనిలో మంచి టాలెంట్ వుంది, కాకపోతే  కొంత సానపడితే ఇతడిలోని అద్భుతమైన నటుడుని బయటకు తీయవచ్చని భావించి జబర్దస్త్ లో తాను చేసే స్కిట్ లో అవకాశం ఇచ్చాడట. అలా జబర్దస్త్ ప్రోగ్రాం కి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించాడు నరేష్. అయితే అతనికి సంబంధించి ఒక వార్త రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారింది.
అదేమిటంటే, నరేష్ త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నాడు అనే వార్త. అదికూడా ఒక సీరియల్ నటిని అంటూ పలు మీడియా మాధ్యమాలు కూడా కథనాలు వెలువరించాయి. ఇక నేడు ఈ వార్తలు ప్రసారం చేసిన మీడియా వర్గాలపై నరేష్ ఓ రేంజిలో ఫైర్ అయ్యాడట. నిజానికి పెళ్లి అనేది చిన్న విషయం కాదని, అది రెండు జీవితాలతో ముడి పడి ఉంటుందని, అయినా అసలు ఇప్పటివరకు తన తల్లితండ్రులు తన పెళ్ళివిషయం నిర్ణయించలేదని, అలాంటపుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఎలా రాస్తారు అంటూ ఆగ్రహించాడట. అంతేకాక ఒక సీరియల్ నటిని చేసుకుంటున్నట్లు  రాశారు, అసలు మీరు చెపుతున్న అమ్మాయితో కనీసం నాకు పరిచయం కూడా లేదు, మరి అటువంటపుడు  ఎలా తప్పుడు ప్రచురిస్తారని అన్నాడట. కాబట్టి ఇప్పటికైనా తనపై రాసె తప్పుడు రాతలకు ఫుల్ స్టాప్ పెట్టాలని తాను మీడియాని కోరుకుంటున్నట్లు చెప్పాడట నరేష్. మరి ఇప్పటికైనా నరేష్ పెళ్లిపై వస్తున్న పుకార్లకు మీడియా చెక్ పెడుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here