సైరాలో జగపతి బాబు లుక్ రివీల్… వైరల్ అవుతున్న ఫొటో!

0
24
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా. తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత గాథ ఆధారంగా రూపొందుతున్న కొత్త సినిమా సైరా నరసింహ రెడ్డి. రేస్ గుర్రం దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ సినిమా పై మరింత అంచనాలు పెంచిందని చెప్పాలి.
ఇక ఇటీవల అమితాబ్, విజయ్ సేతుపతి, తమన్నా లుక్స్ కూడా బయటకు వచ్చి ప్రేక్షకుల నుండి మంచి స్పందన చూరగొన్నాయి. ఇక నేడు టాలీవుడ్ నటుడు జగపతి బాబు పుట్టిన రోజూ సందర్భంగా సైరాలో అయన పోషిస్తున్న వీరారెడ్డి పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఆ పోస్టర్ లో జగపతి బాబు, గడ్డం మరియు తలపాగాతో చాల కొత్తగా కనపడుతున్నారు. కాగా ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది….