దశావతార ఆలయానికి భారీ విరాళమిచ్చిన పవన్ …..

0
27

ఏపీ లో ఎన్నికలు ముగిశాయి. పార్టీ నాయకులూ, కార్యకర్తలు నెల రోజుల పాటు విరామం లేకుండా ప్రచారం చేసి సైలెంట్ అయ్యారు. వారి గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మొక్కు లను తీర్చు కుంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా లోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. దర్శించుకొని ఆలయ ధర్మకర్తలకు, మరియు ఆలయ కమిటీ వారికీ మరియు ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో భారీ విరాళమును అందజేశారు. ఆ ఆలయానికి రూ. 1.32కోట్లు భారీ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ డబ్బు ను ఆలయ అన్నదాన కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here