ఏపీ ఎన్నికల తరువాత మొదటిసారి స్పందించిన పవన్ కళ్యాణ్

0
24

ప్రముఖ సినీనటుడు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల తరువాత మొదటిసారిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో చాల చోట్ల జనసేన పార్టీ ఆఫిసులను మూసి వేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వాటికీ సంభంధించిన ఫొటోలు వీడియోలు కూడా కనిపించాయి. సోషల్ మీడియాలలో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. దీని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా స్పందించాడు. ఈ వార్తలు నిజాలు కావని జనసేన కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఆయన పిలుపు నిచ్చారు.రెండు రాష్ట్రాలలోని నియోజవర్గాలలో జనసేన పార్టీ ఆపీసులు యధాతధంగా కొనసాగుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, జనసేన శ్రేణులంతా సమాజంలో మంచి మార్పు తీసుకు రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఏపీ లో ఎన్నికలు ముగిశాక జనసేన పార్టీ చాల సైలెంట్గా ఉన్నది. టీడీపీ, వైసీపీ లాగా ఏపీ రాజకీయాల్లో అంత యాక్టీవ్ గా కనిపించడంలేదు. దీంతో ఈ వార్తలపై పవన్ స్పందించారు. ఎవరు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కార్యకర్తలలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here