ట్రెండింగ్ లో నిలుస్తున్న జనసేన ఫ్యాన్స్ వెరైటీ పబ్లిసిటీ ….. తెలిస్తే షాక్ అవుతారు!

0
80
ప్రస్తుతం జనసేన పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకేళ్ళేందుకు ఆ పార్టీ అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఇటీవల ప్రజా పోరాట యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించిన పవన్, రాబోయే రోజుల్లో పార్టీ ని మరింత బలోపేతం చేసే పనుల్లో వున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో దాదాపుగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ  చేస్తామని, తమ పార్టీ నీతి, నిజాయితితో వ్యవహరించి మద్యం మరియు డబ్బు పంచకుండా ఎన్నికల్లో విజయం సాధిస్తుందని అధినేత పవన్ అంటున్నారు. ఇక కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఇక అక్కడినుండి ఆ గుర్తును ప్రజల్లోకి బాగా తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులూ మరియు కార్యకర్తలతోపాటు పవన్ ఫాన్స్ కూడా తమ వంతుగా ప్రయత్నాలు ప్రారంభించారు.
Image result for janasena
అంతేకాదు ప్రస్తుతం పలు సోషల్ మీడియా వేదికలను వారు తమ అభిమాన హీరో పార్టీ గుర్తును ప్రచారం చేసేందుకు తెలివిగా వాడుకుంటున్నారు. అయితే వారిలో ఒక వ్యక్తి తనవంతుగా గాజు గ్లాస్ గుర్తును ప్రచారం చేస్తూ పెట్టిన పోస్ట్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ పోస్ట్ లో అతను రాబోయే సంక్రాంతి భోగి మంటల్లో పాత సైకిళ్ళు, పాత ఫ్యాన్లు తీసుకెళ్లి భోగిమంటల్లో పడేసి, ఆ మంటల్లో ఎంచక్కా వేడి వేడి టీ గ్లాస్ లో పోసుకుని తాగుతుంటే, అబ్బా ఎంతో అద్భుతంగా ఉంటుంది అంటూ పోస్ట్ చేసాడు. నిజానికి ఈ పోస్ట్ ఒకరకంగా టీడీపీ, వైసిపి పార్టీలను ఉద్దేశించి చేసిందే అనే విషయం దాదాపుగా అందరికి అర్ధం అవుతుంది. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ పై పలువురు పవన్ అభిమానులు స్పందిస్తూ, రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తప్పకుండ ఏపీలో అధికారాన్ని చేపడతారని అభిప్రాయపడుతూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here