జనసేన పార్టీ న్యూ ఇయర్ వేడుకల్లో అపశృతి….మ్యాటర్ ఏంటంటే!

0
68
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీని మరియు తమ విధానాలను మరింతగా ప్రజలకు చేరువచేయాలనే తలంపుతో విరివిగా పర్యటనలు మరియు యాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అందులోభాగంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అయన జనసేన సదస్సులు మరియు కవాతులు కూడా చేస్తూ ఎప్పటికపుడు ప్రజల సమస్యలపై నిశితంగా పరిశీలన కూడా చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, నిన్న జనసేన పార్టీ విజయవాడ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో గందరగోళం చోటుచేసకుంది.
Disturbance In Janasena New Year Celebrations Vijayawada - Sakshi
మంగళవారం విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్‌ కార్యక్రమానికి అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సహా మరికొందరు నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహంతో ఒక్కసారిగా వేదిక పైకి వచ్చారు. దీంతో పవన్ వ్యక్తిగత బౌన్సర్లకు, జనసేన కార్యకర్తలకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో బౌన్సర్లు జనసేన కార్యకర్తలను నెట్టివేశారు. దీంతో జనసేన కార్యకర్తలు, ఫొటోగ్రాఫర్లు కిందపడిపోయారు. దానితో అక్కడి పరిస్థితి అదుపులో లేకపోవడంతో పవన్‌ కల్యాణ్‌  ఆ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఆగందరగోళంతో వేడుకలు చాలావరకు రసాభాసగా మారిపోయాయి……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here