తెలంగాణ విద్యార్థుల ఆత్మ హత్యలపై స్పందించిన పవన్ …….

0
32

తెలంగాణలో ఇంటర్ ఫలితాలలో జరిగిన తప్పుల వల్ల ఆత్మ హత్యలు చేసుకుంటున్న విషయం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మ హత్యలు చాల బాధాకరమని ఆవేదన చెందారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన గందరగోళం రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు.

విద్యార్థుల భవిష్యతులతో ఆడుకోవడం సరికాదని పేర్కొన్నారు. దీనికి తెలంగాణ ప్రభత్వం భాద్యత వహించాలని, విద్యార్థుల ఆత్మ హత్యలు చాల బాధాకరమని  దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలియజేశారు.

ఫీజుల చెలింపులలో సందేహాలున్నాయని వాటికీ వివరం ఇవ్వాలని చెప్పారు. రివ్యాల్యూషన్, రీవెరిఫికేషన్ ఉచితంగా చేయాలనీ తెలియజేశారు. జీవితం చాల విలువైనదని పలితాలతో నిరాశ  చెంది ఆత్మ హత్యలు చేసుకోవద్దని చెప్పారు. చనిపైన విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని, బోర్డు అధికారులు, సాఫ్ట్ వేర్ సంస్థల పై తగిన చ్చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here