టీడీపీతో పొత్తు పై జనసేన పార్టీ కీలక నిర్ణయం….. ఏంటంటే?

0
60
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో విడగొట్టబడ్డ ఏపీకి ప్రత్యేక హోదా మరియు నూతన రాజధాని ఏర్పాటు విషయమై రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం ఎంతైనా ఉందని భావించి తాము టీడీపీకి మద్దతిచ్చినట్లు అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికలు గడిచి ఇప్పటికి దాదాపుగా ఐదేళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఇటీవల జనసేన పార్టీ పోరాట యాత్రల సమయంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో తామిచ్చిన హామీలన్నీ కూడా టీడీపీ పార్టీ మరచిందని, అంతేకాక రాష్ట్రానికి ప్రాణమైన ప్రత్యేక హోదాని సైతం ఆ పార్టీ నాయకులూ ముఖ్యంగా సిఎం చంద్రబాబు తొక్కిపెట్టి, తరువాత ప్రత్యేక ప్యాకెజీ పేరుతో కూడా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసారు అని పవన్ ఆరోపణలు గుప్పించారు. ఇక అప్పటినుండి పవన్ టిడిపి నాయకులపై తనవంతుగా ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. అయితే ఈ విషయమై నిన్న మీడియాతో మాట్లాడిన ఏపీ సియం చంద్రబాబు నాయుడు, నిజానికి తమకు జనసేన పార్టీ మీద ఎటువంటి వ్యతిరేకత లేదని,
Image result for janasena tdp
గత ఎన్నికల సమయంలో రాష్ట్రానికి మంచి చేస్తారు అనే ఉద్దేశ్యంతో ఎన్డీయేలో భాగస్వామిగా నిలవడం జరిగిందని, అయితే తమ ఆశలను అడియాశలు చేయడంతోనే తాము ఎన్డీయే నుండి బయటకు కూడా రావడం జరిగిందని అన్నారు. ఇక ఈ విషయాలన్నీ కూడా జనసేన అధినేత పవన్ గారికి తెలుసునని, అయినప్పటికీ అయన కేవలం మమ్మల్ని మరియు మా పార్టీ నాయకులను మాత్రమే తప్పుపట్టడం సరికాదని అన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో తమకు జనసేనతో కలిసి వెళ్లడానికైనా సిద్ధమని స్పష్టం చేసారు. అయితే ఈ విషయం పై రెండు రోజులనుండి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుండడంతో, కాసేపటి క్రితం జనసేన పార్టీ ఒక ప్రకటనను విడుదల చేసింది. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ కేవలం వామపక్షాలతోనే పొత్తు పెట్టుకుంటుందని, ఇక మరే పార్టీతోనూ పొత్తు ఉండదని, ఇక రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ ప్రకటనతో టిడిపి, జనసేన పొత్తు ఉండదని తేలిపోయింది. కాగా ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here