జనసేన ఎమ్యెల్యేల తొలి అభ్యర్థుల జాబితా ఇదేనా?|#Janasena|telugugaramchai

0
21
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిస్మస్ సందర్భంగా యూరోప్ పర్యటనలో వున్న విషయం తెలిసిందే.  ఇక అక్కడినుండి వచ్చిన తరువాత అయన మళ్ళి ఇక్కడి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారని జనసేన పార్టీ తరపున మొన్న ఒక ప్రకటన విడుదల చేసారు. ఇక పార్టీ స్థాపన తరువాత అప్పట్లో పార్టీ కార్యకలాపాలపై అంతగా దృష్టి పెట్టని పవన్, ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇకపై పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే ప్రజా పోరాట యాత్రల పేరుతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు కూడా చేపట్టారు. అంతేకాక పార్టీలోకి చేరుతున్న వారిని ఆహ్వానిస్తూ  ప్రాంతాలవారీగా కార్యకర్తలను, నాయకులను కూడా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక అంతేకాక ఇటీవల జరుగుతున్న కొందరు సీనియర్ల చేరికని బట్టి వారికీ పార్టీలో మంచి స్థానం కల్పించి, అలానే మంచి పట్టున్న నియోజకవర్గాల్లో వారికి సీటు కేటాయించేలా పార్టీ సభ్యులతో చర్చలు చేస్తున్నారట. ఇక ఆ పార్టీ తరపున రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే తొలి పదిమంది అభ్యర్థుల జాబితాని సిద్ధం చేసారని కొన్ని రాజకీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
అయితే వారెవరు అనే దానికి సంబంధించి పవన్ యూరోప్ నుండి తిరిగివచ్చాకే ప్రకటన  చేయడం జరుగుతుందని అంటున్నారు. అయితే వారిలో ఇటీవల కాంగ్రెస్ తరపున స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్, టిడిపి నుండి వచ్చిన రావెల కిశోర్ బాబు, తోట చంద్రశేఖర్ వంటి కొందరు ప్రముఖుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరెవరికి ఏ ఏ స్థానాలు కల్పించారు అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రావలసి వుంది. అయితే పార్టీలోకి ఇప్పటికే వచ్చిన వారికీ, అలానే ఇకపై చేరబోయేవారందరికి కూడా పార్టీ తరపున సముచిత స్థానం కల్పించేలా పవన్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఎన్నికలకు మరింత సమయం సమీపిస్తుండడంతో రాబోయే రోజుల్లో పార్టీలోకి చేరికలు మరింతగా ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లు జనసేన వర్గాలు చెపుతున్నాయి.