వైఎసార్సీపి లో చేరిన రాజశేఖర్ , జీవితలు

0
38

గత కొద్దీ రోజులుగా చాలా మంది సినీనటులు వైఎసార్సీపిలో చేరుతున్న విషయం అందరికి తెలిసిందే. కమెడియన్ అలీ కూడా కొన్ని రోజుల క్రితం చేరి వైఎసార్సీపి తరపున  ప్రచారం చేస్తున్నారు.  ఇలా చాలా మంది నటి నటులు వైఎసార్సీపి లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు . ఎపి లో ఎన్నికల నగారా మోగడం తో ఎవరికీ వారు అంటే అటు అధికార పార్టీ టిడిపి , ప్రతిపక్ష పార్టీ వైఎసార్సీపి పార్టీ లు ప్రచారం లో బిజీ బిజీగా పాల్గొంటున్నాయి .

ఈ సారి ఎవరు గెలుస్తారు అనే అంశాన్ని సర్వే చేసిన కొన్ని సంస్థలు కూడా చెప్పలేకపోయాయి . దాంతో ఈ ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి పెరిగిపోతుంది . ఇక సినీ నటుల చేరిక వైఎసార్సీపి లో జరుగుతూనే ఉన్నాయ్ . ఈ కోవలోనే జీవిత , రాజశేఖర్ లు వైఎసార్సీపిలో చేరి పోయారు . గత కొద్దీ కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న వీరు సడన్ గా వైసిపి లో చేరి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు . ఇన్ని రోజులు ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు ఉండేవని అవి ఇప్పుడు లేవని అందుకే మేము వైసిపిలో చేరామని చెప్పుకొచ్చారు .

 జగన్ తో హైదరాబాద్ లో చర్చించిన వీరు వైసిపి కండువాను కప్పుకున్నారు . యువనాయకుడైన జగన్ కు ఒక్క అవకాశమిస్తే మంచిగా చూసుకుంటాడని , కొత్త కొత్త  పథకాలను ప్రవేశపెడతారని , ఈ సారి ఎలాగైనా సరే జగన్ ను గెలిపించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here