జీసస్ నాకు వాట్సాప్ మెసేజి పెట్టారు : రామ్ గోపాల్ వర్మ!

0
65
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా సంచలనమే అని చెప్పాలి. అయన ఇటీవల కొద్దికాలంగా ప్రముఖ మత ప్రబోధకుడు కేఏ పాల్ తో కలిసి మాట్లాడానిని, అయితే అయనను కలిసిన సమయంలో పాల్ కాళ్ళుపట్టుకుని లాగనని, అలా లాగడం వలన పాల్ తలకు దెబ్బతగిలి బ్రెయిన్ బాగా పని చేస్తుంది ఆ విధంగా లాగానని అన్నారు. ఇక కొద్దిరోజులుగా ఆ విషయం సద్దుమణగడంతో అందరూ దానిని పట్టించుకోవడం మానేశారు.
Image result for ram gopal varma
ఇక కొద్దిరోజులుగా పాల్ పలు మీడియా ఛానల్స్ కి వచ్చి, తనతో కలిసి జనసేన పార్టీ అధినేత పవన్ కలిసి రావాలని,  అలా వస్తే ఆయన్ను సీఎం చేస్తానని, లేకపోతే తాను సియం అవడాన్ని ఎవరూ ఆపలేరని పాల్ చెప్పుకొచ్చారు. ఇక పాల్ వ్యాఖ్యలపై వర్మ నిన్న ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, జీసస్ తనకు పర్సనల్ గా వాట్సాప్ మెసేజి చేసారని, అంతేకాక పాల్ కు త్వరలో జ్ఞానోదయం కలిగించి, అయన ముఖ్య అవయవాలకు శిలువ వేస్తానని జీసస్ తనకు చెప్పినట్లు వర్మ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక వర్మ చేసిన ఈ వ్యాక్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై పాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here