అదరగొట్టే ఫీచర్లతో జియో ఫోన్ 3…!

0
97
ఇప్పటికే టెలికాం మార్కెట్ లో సరికొత్త ఆఫర్లతో పెను సంచలనాలు సృష్టించిన జియో, ఆ తరువాత జియో ఫోన్ ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఆ ఫోన్ మంచి సక్సెస్ రావడంతో, కొన్నాళ్ల క్రితం జియో ఫోన్ 2 ను కూడా తీసుకువచ్చింది. ఇక అతి త్వరలో జియో 3 ని లాం చేయబోతోంది. ఇక, ఫుల్ టచ్ స్క్రీన్ డిస్ప్లేతో రాబోతున్న ఈ ఫోన్, ఎవరూ  ఊహించని విధంగా ఈ సంవత్సరం జియో ఫోన్ 3 ని ఆ సంస్థ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వచ్చిన రెండు ఫోన్లు కేవలం కీ ప్యాడ్ మరియు బటన్స్  ఆధారంగా పనిచేసే మోడల్స్ ఐతే,
Image result for jio phone 3
ఈ సంవత్సరం రాబోతున్నది మాత్రం టచ్ స్క్రీన్ ఫోన్ అని జియో సంస్థ ప్రతినిధులు  చెపుతున్నారు. 5 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే‌తో, 2జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ  ఫోన్ మార్కెట్లోకి వస్తుందని అనధికారిక వర్గాలు వెల్లడించాయి. అలానే దీని ధర సుమారు 4,500 రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇంటర్నల్ స్టోరేజ్ సరిపోకపోతే, మెమరీ కార్డు ద్వారా కూడా అదనంగా స్టోరేజ్ పొందొచ్చు. ఇక రేపు మార్కెట్ లోకి విడుదలయ్యాక ఈ ఫోన్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని టెక్ నిపుణులు ఇప్పటినుండే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here