ఎన్టీఆర్ రెండవ కొడుకు ఇపుడు ఎలా ఉన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!

0
76
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత శ్రీ ఎన్టీఆర్ గారి మనవడైన జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడే బాలరామాయణం సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇక అయన పెరిగి పెద్దయ్యాక నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా రంగప్రవేశం చేసారు. ఇక అప్పటినుండి ఒక్కొక్క సినిమాతో తన క్రేజ్ నిమెల్లగా పెంచుకుంటూ వెళ్తున్న ఎన్టీఆర్, అభిమానుల పాలిటి యంగ్ టైగర్ గా పేరు సంపాదించారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన నార్నె శ్రీనివాసరావు తనయ లక్ష్మి ప్రణతితో ఎన్టీఆర్ వివాహం జరిగింది.
ఇక ప్రస్తుతం వారిద్దరు దంపతులకు ఇద్దరు కుమారులు వున్నారు. ఇక తన కుమారులిద్దరికీ కూడా తన తాతయ్య గారి పేరు కలిసొచ్చేలా అభయ్ రామ్ గా పేరు పెట్టారు. ఇక ఇటీవల జన్మించిన రెండవ కుమారుడికి భార్గవ్ రామ్ అనే పేరు నిర్ణయించినట్టు ఎన్టీఆర్ తన అభిమానులతో పంచుకున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు సహా అందరిలోను ఒక ఉత్కంఠభరితమైన ప్రశ్న మెదులుతోంది. ఇప్పటివరకు పెద్ద కుమారుడు అభయ్ కి సంబందించిన ఫోటోలు మరియు వీడియోలు తన అభిమానులతో సోషల్ మీడియా వేదికల్లో పంచుకున్న ఎన్టీఆర్, తన రెండవ కుమారుడి ప్రస్తుత ఫోటోలు అభిమానులకు చూపించకపోవడంతో అతడు అసలు ఇప్పుడు ఎలా వున్నాడో, ఏమి చేస్తున్నాడో తెలుసుకోవాలి అనే ఆసక్తి రేకెత్తుతోంది. అయితే ఇందులో పెద్ద రహస్యమేమీ లేదని, ప్రస్తుతం చిన్న కుమారుడి వయసు చాలా చిన్నది కాబట్టి అతడిని అందరూ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారని, మరికొద్దిరోజులు గడిచాక అతడికి సంబందించిన ఫోటోలను ఎన్టీఆర్ తప్పక తమ అభిమానులతో పంచుకుంటారని, అయన సన్నిహితులు కొందరు చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here