జూనియర్ ఎన్టీఆర్ వాచ్ ధర తెలిస్తే….. దిమ్మ తిరగాల్సిందే! 

0
117
సినిమా హీరోల మరియు హీరోయిన్లకు సంబందించిన ఏ విషయమైనా ఒక రకంగా వారి అభిమానులకు హాట్ టాపిక్ అనే చెప్పాలి. వారు ధరించే దుస్తులు మరియు షూస్, మరియు వారు వాడే కార్లు, బైకులు ఇలా చెప్పుకుంటూ పోతే, ఇది ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ వాడింది అని తెలిస్తే చాలు ఎగపడి మరీ ధర ఎక్కువైనా సరే కొనిస్తుంటారు వారి అభిమానులు. ఇక అలా ఇటీవల కొందరు నటీనటులు వాడిన వస్తువులు, దుస్తులను పోలినవి మార్కెట్ లోకి వచ్చి మంచి క్రేజ్ సంపాదించి సేల్స్ లో కూడా దూసుకెళ్ళినవి వున్నాయి. ఇక అదే విధంగా ప్రస్తుతం టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన ఒక వాచ్ టాలీవడ్ సినిమా వర్గాల్లో వైరల్ అవుతోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే,
రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి వేడుక కోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి  జైపూర్  చేరుకున్న యంగ్ టైగెర్ ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్‌పై అందరి దృష్టి పడింది. ఆ వాచ్ చూడడానికి ఆకర్షణీయంగా ఉండడంతో కొందరు మీడియా మిత్రులు దానిని తమ కెమెరాల్లో క్లిక్ మనిపించారు. తరువాత అసలు ఆ వాచ్ బ్రాండ్ మరియు దాని ధర తెలిసుకుని షాక్ అయ్యారట. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తున్న ఆ వాచ్ ధర అక్షరాలా రూ.2.27 కోట్లు అట. రిచర్డ్ మెల్లే మెక్ లారెన్ కంపెనీకి చెందిన ఈ వాచ్‌ని ఎఫ్ వన్ రేసుల్లో పాల్గొనేవారు ధరిస్తుంటారట. అయితే ఈ వాచ్ ని ఎన్టీఆర్ ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా కొన్నారని అంటున్నారు. ఇక ఆ వాచ్ ధర విన్న కొందరు వామ్మో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. అయితే రాబోయే రోజుల్లో ఇటువంటి వాచ్ ని పోలిన స్పూఫ్ వాచిలు మరికొద్ది రోజులు మార్కెట్ లో వచ్చిన రావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here