జగన్, చంద్రబాబు పై కేసు పెట్టిన కెఏ పాల్…. మ్యాటర్ ఏంటంటే?

0
82
ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గత ఎన్నికల సమయంలో చేసిన హడావిడి అలాంటిఇలాంటిది కాదనే చెప్పాలి. అప్పట్లో తన పార్టీ అధికారంలోకి వస్తుందని, అలానే ప్రజలు తనకు పూర్తి మద్దతు ఇస్తన్నారని చెప్పుకొచ్చిన పాల్, ఎన్నికల తరువాత కనుమరుగయ్యారు. ఇక ప్రస్తుతం ఏపీకి మరొక్కసారి ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన మళ్ళి మీడియా ముందుకు వచ్చి హడావిడి చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.
Related image
వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్నుతున్నారని, తనకు భద్రత కల్పించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కోరారు.  నేడు పోలీస్ కమీషనర్ ని కలిసిన పాల్ తనపై చేస్తున్న తప్పుడు ప్రసారాలు, కొన్ని యూట్యూబ్‌ చానళ్లలో తనపై పోస్టు చేస్తున్న కామెడీ క్లిప్లింగులను ఆయనకు అందించారు. మొత్తంగా వంద యూట్యూబ్ చానళ్లు, కొన్ని వెబ్‌సైట్లు, అలానే కొంతమంది వ్యక్తులపై కూడా అయన ఫిర్యాదు చేశారు. తనపై అసత్య ప్రసారాలు చేస్తున్న అందరిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక పాల్ పెట్టిన కేసు ఉదంతం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here