సంచలనం రేపుతున్న కమల్ రాజకీయ వ్యాఖ్యలు!

0
66
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారతీయుడు-2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తమిళనాడులో కూడా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రజల్లోకి విరివిగా వెళుతూ వారి మెప్పు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇకపోతే ఇటీవల మక్కల్ నీది మయ్యాం పార్టీని స్థాపించిన కమల్ హాసన్, తన పార్టీని కూడా ప్రజలకు మరింతగా చేరువ చేస్తున్నారు. ఇక రెండు రోజులుగా అయన చెన్నై లోని కడలురులో పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రక్షాళన జరగవలసిన సమయం ఆసన్నమయిందని, ఇక రాష్ట్రంలో కేవలం డీఎంకే పార్టీల హావ మాత్రమే కొన్నేళ్లుగా కొనసాగుతుందని,
Image result for kamal haasan
అలానే కేంద్రంలో కూడా రెండు ప్రధాన పార్టీలే దేశ రాజకీయాలను శాసిస్తున్నాయని అన్నారు. ఇక తాను ఇటువంటి కుళ్ళు, మరియు కుతంత్రపు రాజకీయాలు ఎన్నటికీ చేయనని, అంతేకాక అందరికి సమన సదుపాయాలు మరియు ఆర్ధిక ఫలాలు అందినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని, ఒకవేళ రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారాన్ని చేపడితే తాను ముందుగా చేయబోయే కార్యక్రమం అదే అని అయన స్పష్టం చేసారు. ఇక గతంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సభల్లో మోడీ గో బ్యాక్ అనే నినాదాలు చేయలేదా, కాబట్టి ఎంతటివారికైనా కొంత సమయం వరకే ప్రజలు అవకాశం ఇస్తారని, అది రాజకీయనాయకులు గుర్తుంచుకోవాలని మోడీపై పరోక్ష వ్యాఖ్యలు చేసారు. ఇక కమల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారాయి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here