జనసేన నుండి నాకు ఓపెన్ ఆఫర్ వచ్చింది – కత్తి మహేష్!!

0
90
ఇటీవల కొద్దిరోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒంటికాలుతో లేచి, ఆయనపై పలువిధాలుగా ఆరోపణలు చేసిన ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి  మహేష్, అప్పట్లో పవన్ అభిమానుల ఆగ్రహినికి గురై, ఆ తరువాత నగర పోలీస్ కమిషనర్ బహిష్కరణ ఆదేశాలతో దాదాపుగా రాష్ట్రంలో కన్పించకుండా పోయిన విషయం తెలిసిందే. ఇక చాల రోజుల తరువాత నిన్న కత్తి మహేష్ తిరుపతిలో మీడియా ముందుకు వచ్చాడు. నిజానికి తనకు నగర బహిష్కరణ వల్ల తనకు చాలా మేలు జరిగిందని, ఆ సమయంలో విశాఖ నుంచి అనంతపురం వరకు చాలా ప్రాంతాలు తిరిగి ప్రజల స్థితిగతులు తెలుసుకున్నాని అన్నాడు. ఇక తిరుపతిలో కళాకారులకు అన్యాయం జరుగుతుందని, కేవలం బయటనుండి వచ్చిన వారికీ మాత్రమే న్యాయం చేస్తూ, స్థానికంగా ఉండే కళాకారులకు టీడీపీ పార్టీ అన్యాయం చేస్తుందని వారిపై విమర్శలు గుప్పించాడు. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించిన కత్తి మహేష్, వాస్తవానికి తనకు ఏపీలోని ప్రధానపార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన మూడింటి నుండి ఓపెన్ ఆఫర్ వచ్చిందని ప్రకటించాడు.
Image result for kathi mahesh into janasena
మరి కత్తి మహేశ్ ఏ పార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారు అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి  వైసీపీ అనే సమాధానం చెప్తున్నారు ఎక్కువమంది. దానికి కొంత కారణం లేకపోలేదట, అదేమిటంటే, టీడీపీ చేస్తున్న అభివృద్ధి మాటలకే పరిమితం అయ్యిందని అమరావతి, విజయవాడ వెళ్తే తనకు మొత్తం అర్థం అయ్యిందని అయన ఇటీవల చెప్పుకొచ్చాడు.  దానిప్రకారం టీడీపీలోకి వెళ్లను అని ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లే అని, ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని మొదటినుండి వ్యతిరేకిస్తున్నందువల్ల ఎంత ఓపెన్ ఆఫర్ ఇచ్చినా ఆ పార్టీలోకి వెళ్లకపోవచ్చు అని, కాబట్టి ఎలాచూసినా కత్తి మహేశ్ కున్న ఏకైక ఆప్షన్ వైసీపీనే అని వారు అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది. మరి కత్తి రాబోయే రోజుల్లో ఏ పార్టీలో చేరుతారో అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here