ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న కత్రినా క్రికెట్ ఆడుతున్న వీడియో… మ్యాటర్ ఏంటంటే?

0
64
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె మన తెలుగులో మల్లీశ్వరి, అల్లరిపిడుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక త్రలో ప్రారంభం కానున్న మహేష్ బాబు, సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా కూడా ఆమె ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు టాక్ వస్తోంది. ఇక ఆ విషయం అటుంచితే, ప్రస్తుతం సల్మాన్ సరసన భారత్ అనే సినిమాలో నటిస్తున్న కత్రినా, నిన్న రాత్రి షూటింగ్ విరామం సమయంలో క్రికెట్ ఆడుతూ సినిమా యూనిట్ కి షాక్ ఇచ్చింది.
Image result for katrina kaif playing cricket
ఇక ఆమె క్రికెట్ ఆడుతున్న వీడియోని తానే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ, మరొక అనుష్క శర్మను ట్యాగ్ చేస్తూ, నా వీడియో విరాట్ కు చూపించు, ఒకవేళ నేను క్రికెట్ కి పనికివస్తానేమో అంటూ ఒక ట్వీట్ కూడా చేసింది. అయితే ఆమె వీడియోని చూసిన కొందరు నెటిజన్స్, మేడం మీరు మహిళల క్రికెట్ లో ట్రై చేయండి, తప్పకుండ మంచి పేరు సంపాదిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here