తన విజయంపై పవన్ కు కృతజ్ఞతలు చెప్పిన కేసీఆర్……పవన్ రియాక్షన్ తెలిస్తే షాక్ అవుతారు

0
61
తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎందరో త్యాగమూర్తులు ,తమ ప్రాణాలు సైతం అర్పిస్తే, పార్టీ నెలకొల్పిన దగ్గరినుండి తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా ముందుకు సాగి చివరకు రాష్ట్ర సాధనకోసం నిరాహారదీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మరియు ఉద్యమనేత కేసీఆర్. ఇక ఎన్నేళ్ళనుండో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న కల రాష్ట్ర సాధన రూపంలో నెరవేరడంతో రాష్ట్ర ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు. ఇక రాష్ట్రం ఏర్పడ్డ తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితికి కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన మెజారిటీ రావడం, అలానే ఆ పార్టీ ఏకఛత్రాధిపత్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయాయి. ఇక  అధికారం చేపట్టినప్పటినుండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ద్యేయంగా ముందుకునడిచిన కేసీఆర్, ఇక ప్రస్తుత ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం గతంలో చేసిన సంక్షేమ పథకాలే ద్యేయంగా ముందుకు సాగారు. ఇక అనుకున్న సమయంకంటే ఈ సారి శాసనసభకు ఎన్నికలు కొంత ముందస్తుగా రావడంతో టిఆర్ఎస్ సహా ప్రధాన  పార్టీలన్నీ కూడా పోటీలో నిలిచాయి. అయితే గత ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మరియు ప్రజలను అనేక సమస్యల్లో నెట్టిందని, కాంగ్రెస్ టిడిపి, సిపిఐ, టిజెఎస్ సహా ఆ నాలుగుపార్టీలన్ని కలిసి ఒక కూటమిగా ఏర్పడి టిఆర్ఎస్ పై పోటీకి నిలిచాయి.
అయితే నేడు వెలువడుతున్న ఫలితాలను  బట్టి చూస్తే దాదాపుగా ఎక్కువశాతం నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ అన్నింటా ముందు స్థానంలో ఉంది. ఇక ఏపీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గత ఎన్నికల్లో మీకు అన్ని విధాలా మంచి చేసిన ప్రభుత్వానికే ఓటు వేయండని, అటువంటి పార్టీకి తెలంగాణాలో మా మద్దతు ఉంటుందని  ప్రకటించడం ఒకరకంగా పరోక్షంగా టిఆర్ఎస్ కె మద్దతు తెలిపినట్లైంది. ఇక నేడు దాదాపుగా అన్ని స్థానాల్లో టిఆర్ఎస్ భారీ అధిక్యంతో దూసుకుపోతుండడంతో కేసీఆర్ ప్రత్యేకంగా పవన్ కు కాల్ చేసి కృతజ్ఞతలు  చెప్పినట్లు సమాచారం. ఇకపోతే పవన్ కూడా కంగ్రాట్యులేషన్స్ సర్, మీరు రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here