కేసీఆర్ గెలుపుపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!

0
79
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో నేడు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయవంతంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి టిఆర్ఎస్ కు మరింత మెజారిటీ వచ్చే అవకాశం ఉందని, ఇది ఖచ్చితంగా ప్రజావిజయమని టిఆర్ఎస్ శ్రేణులు చెపుతున్నాయి. ఇక కేసీఆర్ కూడా ఈ గెలుపు ఊహించిందే అయినా ప్రజలు మమ్మల్ని ఎంతగానో విశ్వసించారు అని చెప్పడానికి ఇంతటి అద్భుత మెజారిటీ సీట్లు రావడమే కారణమని అంటున్నారు. ఇక కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన అయన తనయుడు కేటీఆర్, ఎన్ని కూటములు పెట్టినా, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అవి ప్రజాక్షేత్రంలో నిలువలేకపోయాయని, నిజమైన ప్రజా సంక్షేమం, నీతి నిజాయితీతో వ్యవహరించే తమ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని అయన అన్నారు. ఇక ఈ గెలుపు ప్రజలపై తమ బాధ్యతను మరింత పెంచిందని అంటున్నారు.
ఇక టిఆర్ఎస్ గెలుపు విషయం తెలియగానే, జాతీయ స్థాయి నాయకుల నుండి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ దాక ఎందరో ప్రముఖులు కేసీఆర్ కు శుభాకాంక్షలు వెల్లువగా అందిస్తున్నారు. ఇకపోతే కాసేపటి క్రితం కేసీఆర్ గారికి ఫోన్ చేసిన ఆయన గెలుపును అభినందించిన ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున, గత ఎన్నికల్లో మీ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే మిమ్మల్ని గెలిపించాయి, అంతేకాక సినిమా పరిశ్రమకి మీరు ఇప్పటివరకు ఎంతో సాయం చేసారని, ఇక రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు అన్నివిధాలా మంచి పాలన అందించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారట. అయితే నాగ్ మాటలకు స్పందించిన కేసీఆర్, మీ తండ్రిగారి సహా మీరు మరియు సినిమా వారందరూ మొదటినుండి తమ ప్రభుత్వం పై చూపిస్తున్న ఆదరణను ఎప్పటికీ మరువలేమని, ఇక రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో పెండింగ్ లో వున్న సమస్యలను కూడా తీర్చి అందరికి అండగా నిలబడతామని కేసీఆర్ అన్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here