కేటీఆర్ కి సీఎం పదవి ఇచ్చే ప్రసక్తి లేదు…. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

0
78
చాలావరకు సర్వేలు మరియు ఎగ్జిట్ పోల్స్ మొన్న తెలంగాణకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ఖాయమని చెప్పినప్పటికీ, మాజీ ఎంపీ లగడపాటి సహా కొన్ని సర్వేలు మాత్రం ఇక్కడ టిఆర్ఎస్ కు మరొక్కసారి అధికారం దక్కే అవకాశం లేదని చెప్పాయి. అయితే అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఈ ఎన్నికల్లో 90కి పైగా సీట్లు చేజిక్కించుకుని తెలంగాణలో అతిపెద్ద పార్టీగా మరొక్కసారి అద్భుత విజయాన్ని సాధించింది. అయితే తమ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలే తమను గెలిపించాయని చెప్తున్న కేసీఆర్, ఇది పూర్తిగా ప్రజావిజయమని అన్నారు. ఇక ఫలితాలు కూడా తేలి తమ పార్టీ విజయం సాధించడంతో, సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై పార్టీలో కొంతమంది చర్చను లేవనెత్తారు. అయితే గత ప్రభుత్వంలో సీఎం అభ్యర్థి అయిన కేసీరే ఈసారి కూడా సీఎం అని పార్టీ నాయకులందరూ నొక్కి చెప్తున్నారు.
ఇక నేడు జరిగిన ఒక మీడియా సమావేశంలో ఒక పత్రిక ప్రముఖుడు, కాబోయే సీఎం మీ అబ్బాయి కేటీఆర్ అంటున్నారు, అది నిజమేనా దీనిపై మీ అభిప్రాయం ఏంటని అడగ్గా, దానికి బదులిచ్చిన కేసీఆర్, నిజానికి ఇండియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ రాష్ట్రానికి సీఎం గా పనిచేస్తూ పీఎం గా కూడా చేసారని, అదే విధంగా తాను కూడా ఈ రాష్ట్రానికి సిఎం అవడమే కాక త్వరలో దేశ రాజకీయాలను సాధించి థర్డ్ ఫ్రంట్ ద్వారా పీఎం కాగలనని అన్నారు. అయితే అయన ఇచ్చిన సమాధానంలో కేటీఆర్ మాటను ఏ మాత్రం వినపడనీయకుండా తెలివిగా మాట్లాడడం చూసి అక్కడి పత్రిక ప్రతినిధులందరూ కూడా కేసీఆర్ తెలివితేటలకు ముక్కున వేలు వేసుకున్నారట. ఇక దీన్నిబట్టి తెలంగాణకు మళ్ళి కాబోయే సీఎం కేసీఆర్ అనే విషయం చాలావరకు తేటతెల్లమైనట్లే అని అర్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here