కౌంటింగ్ పూర్తి అవగానే కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలిస్తే షాక్ అవుతారు!

0
73
గత ఎన్నికల్లో చేసిన అభివృద్ధి మరియు ప్రెవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమకు శ్రీ రామ రక్ష అని ఈ శాసన సభ ఎన్నికల్లో బరిలోకి దిగిన టిఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం అందుతున్న ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే దాదాపుగా అత్యధిక స్థానాలను కైవశం చేసుకునే దిశగా సాగుతోంది. ఇక కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, టిజెఎస్ నాలుగు పార్టీలు కలిసి జతకట్టి కూటమిగా ఏర్పడినప్పటికీ కూడా ప్రజల్లో టిఆర్ఎస్ పై వున్న అభిమానాన్ని ఏ మాత్రం పోగొట్టలేకపోయాయి అనేది ప్రస్తుతం వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే తేటతెల్లం అవుతుంది. ఇక గత ప్రభుత్వంలో కేసీఆర్ మరియు టిఆర్ఎస్ పార్టీ తమ పాలనలో కొన్ని తప్పిదాలు చేసిందని ప్రజలు మరియు ఇతర పార్టీ నాయకుల నుండి విమర్శలు ఎదుర్కొంది.

వాటిలో ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వంలో కొందరు మహిళా ఎమ్యెల్యేలు ఉన్నప్పటికీ కూడా అయన తన క్యాబినెట్ లో ఒక్క మహిళా నాయకురాలికి కూడా మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. అంతేకాక తమ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒక దళితుడిని సీఎం ని చేసామన్న కేసీఆర్, ఆ మాట కూడా తప్పడంతో కొంత విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఈ ఎన్నికల్లో దాదాపుగా విజయం ఖాయం అవడంతో తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమైన కొందరు మహిళా అభ్యర్థులను తమ క్యాబినెట్ లోకి తీసుకోవాలని, అలానే అవాకాశం వున్నంతవరకు కొందరు దళిత నాయకులకి కూడా మంత్రిపదవులు ఇచ్చేలా ఆలోచన చేస్తున్నారట.
ఇక ఈ విషయమై ఇప్పటికె పార్టీలోని ముఖ్యులతో చర్చించిన కేసీఆర్, తాను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ కొత్త నిర్ణయాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తమ పార్టీపై ప్రజలు చూపిస్తున్న అభిమానానికి తాము ఎప్పటికీ రుణ పడి ఉంటామని, అంతేకాక ఈ సారి గతంలో కంటే మరింత అభివృద్ధి చేసి చూపించి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతామని అయన అంటున్నారు. ఇక కేసీఆర్ ఈ రెండు విధానాలను కనుక అమలు చేస్తే నిజంగా ఆయనపై ప్రజల్లో మరింత అభిమానం పెరగడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here