ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

0
37
కేరళ సీనియర్ నాయకులు KM మని ఈ రోజు సాయంత్రం కేరళలోని లకే షోర్ హాస్పిటల్ లో  చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు .గత వారం చాతి నొప్పితో హాస్పిటల్ లో చేరిన ఈయన అప్పటి నుండి బెడ్ కె పరిమితమయ్యారు . డాక్టర్లు ఎంతకష్ట  పడ్డ అతన్ని కాపాడలేకపోయారు . ఈయన మరణం తో కేరళ మొత్తం ఒక్కసారిగా  షాక్ కు గురైంది .
 కేరళ రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్న ఈయన మరణం తీరని లోటని ప్రముఖ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు .  1979 లో రాజకీయాల్లోకి వచ్చిన మని తర్వాత తిరిగి చూసుకోకుండా ముందుకు సాగారు. ఈయన 13 సార్లు అసెంబ్లీ  ఎన్నికల్లో గెలిచి తన ప్రతాపాన్ని చూపించారు . కేరళ కాంగ్రెస్ లో ఒక గొప్పనాయకుడిగా ఉన్న KM మని మరణం తీరని లోటని కాంగ్రెస్ సంతాపం తెలిపింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here