మరొక సంచలన రికార్డు నమోదు చేసిన ‘కెజిఎఫ్’ మూవీ!

0
97
ప్రముఖ కన్నడ స్టార్ యాష్ మొదట్లో చిన్న చిన్న సీరియల్స్ లో నటిస్తూ తన లైఫ్ ని లీడ్ చేసారు. అయితే ఆ తరువాత మెల్లగా సీరియల్స్ లో నటిస్తూ పేరు సంపాదించిన యాష్, ఆ తరువాత సినిమా రంగానికి కూడా పరిచయమయ్యారు. అయితే మొదట్లో సినిమాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్న యాష్, ఆ తరువాత కన్నడ నాట మంచి హీరోగా మంచి పేరు సంపాదించి, అభిమానుల గుండెల్లో రాకింగ్ స్టార్ గా నిలిచారు. అయితే అయన ఇటీవల నటించిన సినిమా కెజిఎఫ్ విడుదలైన అన్ని భాషల్లోనూ కనకవర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నిజానికి పాన్ ఇండియా అపీల్ సినిమాలో ఉండడంతో అన్ని భాషల ప్రేక్షకులు సినిమాని విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇక సినిమాలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్న యాష్, సినిమా విజయంలో కీలకపాత్ర పోషించారు అనే చెప్పలి… ఇక ఇటీవల పాకిస్థాన్‌లో విడుదలైన తొలి కన్నడ సినిమాగా ఇది రికార్డులకెక్కి సంచలనాన్ని నమోదు చేసింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను లాహోర్, ఇస్లామాబాద్‌లలోని మల్టిప్లెక్స్‌లలో శుక్రవారం విడుదల చేశారు.
Image result for kgf movie telugu
అయితే అక్కడ కూడా ఈ సినిమా విజయవంతం అవడం విశేషం. ఇక ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశాడు. మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందింది. తొలి భాగం గత డిసెంబర్‌లో విడుదల అవ్వగా, రెండో భాగాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు సినిమా యూనిట్. ఈ సినిమాతో యాష్ ఒక్క దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలోనూ సూపర్ క్రేజ్ సంపాదించి ముందుకు సాగుతున్నాడు…ఇకపోతే దేశవ్యాప్తంగా 2400 థియేటర్లలో సినిమా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.200 కోట్ల రూపాయల పైబడి వసూళ్లు రాబట్టింది. అలానే యూఎస్‌లోనూ మంచి వసూళ్లు సాధించింది. అంతేకాదు హిందీ డబ్బింగ్ సినిమాల్లో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన నాలుగో చిత్రంగా ‘కేజీయఫ్’ నిలిచింది. మరి ఇన్నిసంచలనాలు సృష్టించిన ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here