ప్రకంపనలు సృష్టిస్తున్న క్రిష్-కంగనా వివాదం… మ్యాటర్ ఏంటంటే?

0
106
తొలిసారి తీసిన గమ్యం సినిమాతో తనకంటూ కొంత ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు క్రిష్, తరువాత కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి సినిమాలు తీసి ప్రేక్షకులతో శభాష్ అనిపించుకున్నారు. అయితే తరువాత బాలీవుడ్లో వీరనారి ఝాన్సీరాణి జీవిత కథ ఆధారంగా తాను తీయ సంకల్పించిన మణికర్ణిక సినిమాని మొదలెట్టారు, అయితే ఆ సినిమా మధ్యలో ఉండగా, సడన్ గా ఆయనకు ఎన్టీఆర్ బయోపిక్ తీయడానికి అవకాశం రావడంతో అయన దానిని నిర్మాతలు మరియు ప్రధాన పాత్రధారి కంగనా రణావత్ కు అప్పగించి ఎన్టీఆర్ పై కసరత్తు మొదలెట్టారు. ఇక తీరా ఇప్పుడు సినిమా విడుదలకు దగ్గరవుతుండడంతో క్రిష్ అనూహ్యంగా కంగాణపై మతాల యుద్ధం మొదలెట్టారు. నేను దర్శకత్వం వహించిన సినిమా స్వచ్ఛమైన బంగారం అయితే కంగనా రనౌత్‌ దాన్ని వెండిగా మార్చింది అని ఆవేదన వ్యక్తం చేసారు. లక్ష్మీబాయి వీరగాథను తెరపైకి తీసుకురావడానికి చిత్రబృందమంతా ఎంతో శ్రమించారని, సినిమా సజావుగా విడుదల కావడం కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇప్పటికీ కంగనా ఏం చేసిందో చెప్పకపోతే అందరి శ్రమను అగౌరపరిచినట్టేనన క్రిష్‌ అన్నారు.
Related image
నేను ‘మణికర్ణిక’ పనులు చివరిదశలో ఉండగా, మధ్యలో చిత్రాన్ని వదిలి వెళ్లానని అన్న ప్రతిసారీ, నా మనసు కుంగిపోయింది అని ఆయన తన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో తెలిపారు. మణికర్ణిక టైటిల్స్‌లో తన పేరును ‘క్రిష్‌’ బదులు ‘రాధాకృష్ణ జాగర్లమూడి’గా వేయడంపైనా ఆయన స్పందించారు.  మొదట్లో విడుదలైన సినిమా పోస్టర్లలో నా పేరు ‘క్రిష్‌’ అని ఉంటుంది. సెకండ్‌ పోస్టర్‌, ట్రైలర్‌లో సడన్‌గా ‘రాధాకృష్ణ జాగర్లమూడి’ అని ఉంది. అదేంటని నేను కంగనను అడిగితే, సోనూ సూద్‌ నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీరు నాకు మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు మీ పేరు గురించి నేనెందుకు ఆలోచించాలి’ అని చెప్పిందని అన్నారు… సోనూ సూద్‌ని చిత్రం నుంచి తప్పించడానికి ఆమెకు ఏం అధికారం ఉందని, నేను తీసిన చిత్రంలో మార్పులు చేయడానికి ఆమె ఎవరు, అలానే నిర్మాతలు వీటన్నిటికీ సమాధానం చెప్పాలని అయన డిమాండ్ చేసారు.  మరి ఈ వివాదం మున్ముందు మరిన్ని మలుపులు తిరుగుతుందో, క్రిష్ వ్యాఖ్యలపై కంగనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here