జగన్ తో కేటీఆర్ భేటీ : ఏపీకి ప్రత్యేక హోదా విషయమై సంచలన వ్యాఖ్యలు! 

0
71
గత నాలుగేళ్లలో తమ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తెలంగాలలో తమకు మరొక్కసారి విజయాన్ని అందించాయని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక నేడు అయన వైసిపి అధినేత జగన్ కలవడం రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తిని రేపిందనే చెప్పాలి. వైసీపీ అధినేత జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జగన్ తో ఇది ప్రారంభ సమావేశం మాత్రమేనని, అతిత్వరలో ఏపీకి కేసీఆర్ వెళ్లి జగన్ తో అన్ని విషయాలపై లోతుగా మాట్లాడతారని చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలసికట్టుగా ఎలా ముందుకు వెళ్లాలో కేసీఆర్ చెబుతారని తెలిపారు. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఆ తర్వాత చెప్పడానికి మరేమీ ఉండదని చమత్కరించారు.
Image result for ktr jagan
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్పష్టతను ఇచ్చారని, తాము ఎప్పుడు ఏపీ ప్రజల సౌఖ్యాన్ని కోరుకుంటామని, అప్పట్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు వారికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని అయన స్పష్టం చేశారు. రాజ్యసభలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కె.కేశవరావు, లోక్ సభలో ఎంపీ కవితతో పాటు పలు వేదికలపై తాము ఏపీకి ప్రత్యేక హోదాపై పూర్తి మద్దతుగా తమ వైఖరిని స్పష్టం చేశామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి ప్రధాని ఇచ్చిన హామీ మేరకు అది నెరవేర్చితీరాలని డిమాండ్ చేసారు. కాబట్టి ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని, ఇందులో రెండో అభిప్రాయం లేదని చెప్పారు. అయితే రాబోయే ఏపీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఇక్కడ జగన్ కు సపోర్ట్ చేసే అవకాశం ఉందని, అంతేకాక ఎంత పరోక్షంగా చెప్తున్నప్పటికీ వారి పూర్తి మద్దతు మాత్రం వైసిపి పార్టీకే ఇస్తున్నట్లు దీన్నిబట్టి అర్ధమవుతోంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here