టిఆర్ఎస్ గెలుపు తరువాత కేటీఆర్ భార్య చేసిన పనికి షాకైన కేటీఆర్!

0
72
అనుకున్న సమయంకంటే నాలుగు నెలల ముందుగా జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబందించి నేడు వెలువరించిన ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ మరొకసారి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయం ముందే ఊహించినప్పటికీ, ఇంతటి అత్యధిక మెజారిటీ ప్రజలు అందిస్తారని తాము ఊహించలేదని ఆ పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ నాయకులందరూ చెపుతున్నారు. ఇక రెండవసారి రాష్ట్రంలో తమకు అధికారం దక్కడం ఒకరకంగా రాష్ట్ర అభివృద్ధిపై మాకున్న బాధ్యతను మరింత పెంచిందని కేసీఆర్ అంటున్నారు. అయితే ఒకవేళ మహాకూటమి వస్తే రాష్ట్రాన్ని అన్నివిధాలా దోచుకుని భ్రష్టుపట్టించేదని, అటువంటి వారికి ప్రజలు తమ ఓటు ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఇకపోతే టిఆర్ఎస్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా కేసీఆర్ కోడలు మరియు మంత్రి కేటీఆర్ భార్య అయిన శైలిమ విపరీతమైన ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారట.
అంతేకాదు, అన్ని టివి ఛానల్స్ లో టిఆర్ఎస్ విజయం పై ప్రకటనలు రాగానే ఆమె తమవారందరికి స్వీట్లు పంచారని, అంతేకాక తమ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి ఒక నెల జీతం బోనస్ గా కూడా ఇవ్వడానికి నిశ్చయించారని సమాచారం. ఇక గత ఎన్నికల్లో తన మావయ్య కేసీఆర్ గారు మరియు భర్త కేటీఆర్ గారు, అలానే అన్నయ్య హరీష్ రావు గారు, వదిన కవిత గారు చేసిన అభివృద్ధి మంత్రమే మాకు మరొక్కసారి అధికారాన్ని చేపట్టేలా చేసిందని ఆమె అంటున్నారట. ఇక ఈ విజయాన్ని తనతో పాటు తమ వారు అందరికి కూడ పంచాలనే ఉద్దేశ్యంతో తాను ఇలా బోనస్ ల ప్రకటన చేసినట్లు చెప్పారట. ఇక ఆమె చేసిన పనికి కేసీఆర్, కేటీఆర్ సహా ఆ పార్టీ నాయకులు మరియు వారి కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here