ఎన్టీఆర్ కథానాయకుడు పై లక్ష్మి పార్వతి షాకింగ్ కామెంట్స్!

0
106
దివంగత నటులు మరియు రాజకీయనాయకులు అయిన ఎన్టీఆర్ గారి జీవిత గాథ ఆధారంగా రూపొందిన సినిమా ఎన్టీఆర్. ఇక ఈ సినిమా మొదటి భాగం కథానాయకుడు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా చూసిన ప్రేక్షకులు మరియు కొందరు సినిమా ప్రముఖులు సినిమా అద్భుతంగా వుంది అంటూ తమ అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. ఇక కాసేపటి క్రితం ఎన్టీఆర్ గారి సతీమణి లక్ష్మి పార్వతి సినిమాపై తన అభిప్రాయన్ని మీడియాతో పంచుకున్నారు… ఆమె మాట్లాడుతూ, నిజానికి ఆ మహానుభావుడిపై తీసిన ఈ సినిమా చూడమని నన్నెవరూ ఆహ్వానించలేదు.
Related image
బాలకృష్ణ మరియు చంద్రబాబు కనుసన్నలలోనే ఈ బయోపిక్ రూపొందింది. అందువలన ఎన్టీఆర్‌కి సంబంధించిన పూర్తి వాస్తవాలు తెరకెక్కే అవకాశం లేదు. ఈ కారణంగానే అటు జనంలోనూ, ఇటు నిజమైన అభిమానుల్లోనూ ఈ సినిమాపై ఎలాంటి ఆసక్తి లేదు. అందరూ కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల కోసమే ఎదురుచూస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. అయితే ఉన్నది ఉన్నట్టుగా ఎన్టీఆర్ బయోపిక్‌ను నిజాయితీగా రూపొందించే దమ్ము, ధైర్యం రామ్ గోపాల్ వర్మకి మాత్రమే ఉంది అని ఆమె స్పష్టం చేశారు. కాగా లక్ష్మి పార్వతి చేసిన వ్యాఖ్యలు అటు టాలీవుడ్, ఇటు రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here