టాలీవుడ్ ని షేక్ చేస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ First Day కలెక్షన్స్|Telugugaramchai

0
68
Indian 2000 Rs Currency Note in isolated white background

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ . ఈ రోజు విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతుంది . రాజకీయనాయకుడు , సినీ నటుడు  ఎన్టీఆర్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడం దీనిని వర్మ డైరెక్ట్ చెయ్యడం తో ఈ మూవీ పై భారీ అంచనాలే పెరిగిపోయాయి . దానికి తగ్గట్టు గానే వర్మ తెరకెక్కించారని అభిమానులు చెప్పుకొస్తున్నారు .

 ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం , రాజకీయ జీవితం , ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మి వచ్చిన తర్వాత జరిగిన కీలక మైన అంశాలతో వర్మ  తెరకెక్కించడం తో మంచి స్పందనే వస్తుంది. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో వివాదాల మధ్య విడులై ఎన్నికల ఉండడంతో ఈ మూవీ ని ఎపి ప్రభుత్వం అనుమతించలేదు . ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వర్మ చెప్పిన సమయానికి విడుదల చేసాడు .
 ఇక లక్ష్మి స్ ఎన్టీఆర్ మూవీ మార్నింగ్ , మాటనే షో లను కలిపి దాదాపు 50 లక్షల మార్క్ ను దాటేసినట్టు విశ్లేషకుల అంచనా . ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ తోవచ్చిన బాలయ్య కథానాయకుడు , మహానాయకుడు భారీ ప్లాపులను మూటకట్టుకున్న విషయం అందరికి తెలిసిందే . ఏది ఏమైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుందని చెప్పాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here