చంద్రబాబు మేనల్లుడి మృతదేహం వద్ద బ్రాహ్మణి చేసిన పని చూసి షాకైన లోకేష్!

0
110
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు ఉదయ్‌కుమార్‌(43) హైదరాబాద్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. అయన మృతికి టీడీపీ మరియు ఇతర పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు  తమ సంతాపం తెలియచేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు సోదరి హైమావతి పుత్రుడైన ఉదయ్ కుమార్, కొన్నేళ్ళనుండి హైదరాబాద్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు ఉదయ్‌ కుమార్‌. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లికి చెందిన కనుమూరి హైమావతి, కనుమూరి చంద్రబాబునాయుడు కుమారుడు ఉదరుకుమార్‌. ఆయనకు భార్య సింధుర, కుమార్తె వన్షిక ఉన్నారు. ఉదయ్‌కుమార్‌ హైదరాబాద్‌లో కెసిబిఎన్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. మొదటినుండి ఉదయ్ చంద్రబాబు మరియు లోకేష్ లకు వారి పర్సనల్ పనులు చూడడంలో కూడా కొంత చేదోడువాదోడుగా ఉండేవాడట. అయితే గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లోనే తన తల్లితండ్రులతో ఉంటున్న ఉదయ్ మొన్న రాత్రి హఠాత్తుగా గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు.
నిజానికి ఎప్పుడు ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించే ఉదయ్ కు నిన్న అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో ఉదయ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉదయ్‌కుమార్‌ మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తరలించి అక్కడి నుంచి స్వగ్రామానికి తరలించారు. ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి, పంచాయతిరాజ్‌ శాఖ మంత్రి లోకేష్‌ సతీమణి బ్రహ్మణి కందులవారిపల్లికి చేరుకుని నివాళి అర్పించారు. అయితే ఉదయ్ మృత దేహాన్ని చూసిన వెంటనే బ్రాహ్మణి భోరున విలపించారట, ఇక ఈ ఘటనను చూసిన ఆమె భర్త లోకేష్ కొంత ఆశ్చర్యపోయారని, అయితే నిజానికి ఉదయ్ అన్నయ్యతో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఇక లోకేష్ తో తన వివాహం తరువాత ఎన్నోపనుల్లో తనకు సహాయంగా ఉండి సేవలందించారని బ్రాహ్మణి చెప్పుకొచ్చారు.
అంతేకాక చిన్నప్పటినుండి నాన్న బాలకృష్ణ గారు కూడా ఉదయ్ వాళ్ళ ఇంటికి తమను తీసుకెళ్లేవారని అప్పటి రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. కాగా నేడు నిర్వహించే ఉదయ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జూనియర్‌ ఎన్‌టిఆర్‌, తదితరులు హాజరుకానున్నట్లు కందులవారిపల్లి మాజీ సర్పంచి పాళెం చంద్రకుమార్‌నాయుడు విలేకరులకు తెలిపారు. కలెక్టర్‌ ప్రద్యుమ్న, అర్బన్‌ ఎస్‌పి అన్బురాజన్‌, డిపిఒ సురేష్‌నాయుడు సారథ్యంలో జిల్లా అధికారులు కందులవారిపల్లికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఇక బ్రాహ్మణి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here