రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రియురాలు….

0
39

పేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యి ప్రేమకు దారి తీసింది. వాళ్ళ ప్రేమకు పెద్దలు అంగీకరించాలని దేవుడిని వేసుకునేందుకు ద్విచక్రవాహనం పై ఆ ప్రేమికులు యదిరిగుట్టకు బయలుదేరారు. మార్గం మధ్యలో కారు రూపంలో వచ్చిన మృత్యువు  వారి ప్రేమని  విడదీసింది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో చోటు చేసుకున్నది. బీబీనగర్ ఎసై సుధాకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపురం గ్రామానికి చెందిన దాడి శ్రీ కాంత్ హైదరాబాద్ లోని రాంనగర్ లో క్యాటరింగ్ పనిచేస్తూ నివశిస్తున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగుడ గ్రామానికి అరుణ హైదరాబాద్ నాంపల్లి లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నది. వీరి పేస్ బుక్ పరిచయం ప్రేమగ మారింది. వల్ల ప్రేమను పెద్దలు అంగికరించాలని ఉద్దేశంతో యాదగిరి గుట్ట బయలు దేరారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో కింద పడ్డారు. అతివేగంగా వస్తున్నకారు  వారి ఢీ కొట్టింది. అబ్బాయి తలకు హెల్మెట్ ధరించడం వాళ్ళ అతనికి ఏమి అవ్వలేదు. కానీ అతని ప్రియురాలి తల పై నుచి కారు టైరు పోవడం వల్లనా ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here